Wednesday, May 6, 2026 11:35 PM
Wednesday, May 6, 2026 11:35 PM

ఆ విషయంలో అన్నకు చెల్లి మద్దతు..!

తెలుగు రాజకీయాల్లో అన్న చెల్లెళ్ల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ఒంటి కాలుపై లేస్తున్నారు. అన్నకు సంబంధించిన ఏ విషయమైనా సరే.. ముందుగా షర్మిల స్పందిస్తున్నారు. అన్న, వదినలను పదే పదే టార్గెట్ చేస్తున్నారు షర్మిల. చివరికి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సాక్షి యజమాని వైఎస్ భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు కూడా. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో షర్మిల పాత్ర కూడా ఉంది. బాబాయ్ హత్య కేసు మొదలు.. తనను ఆర్థికంగా మోసం చేసిన అన్న గురించి ఏపీ ఓటర్లకు సవివరంగా వివరించారు. దీంతో తల్లిని, చెల్లిని జగన్ మోసం చేశాడని ఏపీ ఓటర్లు బలంగా నమ్మారు.

Also Read : పార్ట్ టైం బౌలర్ ఎక్కడ..? భారత జట్టుకు ఇదే సమస్య

అటు తెలంగాణలో కూడా అన్న చెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ వారసుడు ఎవరూ అనే విషయం తొలి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే నేత, సీఎం కుర్చీలో కూర్చునే లీడర్ ఎవరు అనే విషయంపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్, కవిత, హరీష్ రావు వేరు వేరుగా రాజకీయాలు చేస్తున్నారని.. పార్టీలో గ్రూపు పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి కూడా. ఇక ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్‌కు కుమార్తె కవిత రాసిన లేఖ పెద్ద దుమారం రేపింది కూడా. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, భూతాలు చేరాయంటూ పరోక్షంగా అన్నపై విమర్శలు చేశారు. అదే సమయంలో తన తెలంగాణ జాగృత్తి బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు. ఇక కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ పుకార్లు కూడా షికారు చేశాయి.

Also Read : తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!

ప్రస్తుతం అన్న చెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరంటే ఒకరికి ఏ మాత్రం సరిపడటం లేదు. పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం అన్న కేటీఆర్‌కు చెల్లెలు కవిత మద్దతు తెలిపారు. ఈ-ఫార్ములా రేస్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రేవంత్ సర్కార్ తొలి నుంచి ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తాజాగా మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఘాటుగా స్పందించారు కవిత. కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నోటీసులు ఇచ్చారని.. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం.. అంటూ పోస్ట్‌ చేశారు. అన్నకు చెల్లెలు మద్దతు ఇవ్వడం ఇప్పుడు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీరినట్లే అంటున్నారు పార్టీ నేతలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్