Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

చెవిరెడ్డికి తుడా దెబ్బ.. అరెస్టుకు రెడీ..?

ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతల వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా ఫోకస్ పెడుతూ వస్తోంది. అవినీతి అక్రమాల విషయంలో సాక్షాలు సేకరించి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన అధికారులకు కూడా ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అయితే కొంతమంది నేతలు విషయంలో ముందుకు వెళ్లడం లేదని విమర్శలు సైతం ఈ మధ్యకాలంలో ప్రధానంగా వినపడుతున్న మాట వాస్తవం. టిడిపిని ఇబ్బంది పెట్టిన వాళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదనేది టిడిపి కార్యకర్తలు అసహనం.

Also Read :సినిమా పరిశ్రమ దారిలోకి వచ్చిందా..?

దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సైలెంట్ గా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. అప్పట్లో అక్రమాలు చేసిన నాయకుల జాబితాను సిద్ధం చేసి ఒక్కొక్కరిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు ముందు రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేందుకు అధికారులు కూడా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు వెళ్లాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Also Read :చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?

ఆయన తుడా చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో నిధులను దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2019 నుంచి 2024 మధ్య నిధులు కేటాయింపు పై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. 35 ప్రశ్నలతో విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటుగా అప్పటి ఉపాధ్యక్షుడు, కార్యదర్శిలకు కూడా నోటీసులు వెళ్లాయి. చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన 15 మంది ఎంపీడీవోలకు నోటీసులు పంపారు. నిధులను 90% చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టారనే దానిపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్