Monday, October 27, 2025 08:16 PM
Monday, October 27, 2025 08:16 PM
roots

చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?

రాజకీయాల్లో కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉంటాయో.. గత 5 ఏళ్ళలో జగన్ చూపించారు. ఏ మాత్రం ఆధారాలు లేకపోయినా టీడీపీ నేతలను జైల్లో పెట్టించారు. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత సిఎం చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు అప్పట్లో. దీనిపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులు పలు దేశాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అని అందరూ భావించారు. అవినీతి, అక్రమాల విషయంలో ఆధారాలు ఉండటంతో అరెస్ట్ ఖాయం అని భావించారు.

Also Read : క్రికెట్ ప్రపంచం గుర్తించని హీరో.. శశాంక్ సింగ్

కాని ఇప్పటి వరకు జగన్ విషయంలో ముందుకు వెళ్ళలేదు. లిక్కర్ కుంభకోణంలో తీవ్ర విమర్శలు వచ్చి.. విచారణ ముందుకు వెళ్ళినా సరే, జగన్ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఆధారాలు లభించినా ఆయనను అరెస్ట్ చేసే విషయంలో ముందుకు వెళ్ళడం లేదు. అటు కేంద్రం నుంచి కూడా ఈ విషయంలో సహకారం లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ టైం లో చంద్రబాబు సంచలన కామెంట్స్ చేసారు. “తనను జైల్లో పెట్టారని.. జగన్‌‌ను కూడా జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది.. అది కరెక్ట్ కాదు కదా” అంటూ మాట్లాడారు.

Also Read : రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!

మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చంద్రబాబు ఈ కామెంట్ చేసారు. దీనిపై టీడీపీ సోషల్ మీడియా మండిపడుతోంది. ఇది చేతగాని తనం అంటూ కామెంట్స్ చేస్తోంది. అరెస్ట్ చేయడానికి భయపడినప్పుడు.. అప్పట్లో ట్రీట్మెంట్ అనే కామెంట్ ఎందుకు చేసారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ సోషల్ మీడియా. ఇక టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో మండిపడుతున్నారు. జగన్ విషయంలో చంద్రబాబు వైఖరి మారాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్