Sunday, June 21, 2026 08:03 AM
Sunday, June 21, 2026 08:03 AM

అక్కడికి రాహుల్ వచ్చేస్తున్నాడు..? బెర్త్ ఖరారు

టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపుతున్నాడు. గతేడాది ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న.. కేఎల్ రాహుల్ ఈ సీజన్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా అతను చేసిన సెంచరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 2024 సీజన్లో ఫామ్ లేక అటు యాజమాన్యం నుంచి ఇటు అభిమానుల నుంచి కూడా అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోయి జాతీయ జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకమైంది.

Also Read : సాయి సుదర్శన్ స్పాట్ ఫిక్స్..?

అయితే గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాహుల్ ఆటతీరులో మార్పు వచ్చింది. ఇక అక్కడ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ లో మెరుగైన ప్రదర్శనలు చేయడం.. ఐపీఎల్ లో కూడా అంచనాలకు మించి రాణించడం జరిగాయి. ఇక తాజాగా చేసిన సెంచరీ తో తనలో t20 ఆటగాడు ఉన్నాడని రాహుల్ ప్రూవ్ చేసుకున్నాడు. భారీ సిక్సులతో మైదానం నలుమూలల.. అభిమానులను ఆకట్టుకునే షాట్లు ఆడాడు. దీనితో రాహుల్ మళ్లీ అంతర్జాతీయ టి20లలో అడుగుపెట్టే అవకాశం కనబడుతోంది.

Also Read : రికార్డ్ బ్రేకింగ్ జోడీ.. సాయి సుదర్శన్ – గిల్

బంగ్లాదేశ్ తో జరగబోయే టి20 సిరీస్ కు రాహుల్ ఎంపిక అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం టి20 క్రికెట్లో ఎక్కువగా కొత్త ఆటగాళ్లను బోర్డు పరిశీలిస్తోంది. సీనియర్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఈ టైంలో మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చిన రాహుల్ టి20లో.. అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అటు సారధ్య బాధ్యతల విషయంలో కూడా రాహుల్ ను ఎంపిక చేయవచ్చు అనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా రాహుల్ కీలకం కానున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్