Friday, September 12, 2025 09:00 PM
Friday, September 12, 2025 09:00 PM
roots

హరీష్ విషయంలో క్లారిటీ ఎక్కడ..? ప్రచారం నిజమేనా..?

ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి లో మాజీ మంత్రి హరీష్ రావుది కీలక పాత్ర. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కేసీఆర్ వెంట ఎవరు నిలబడిన నిలబడకపోయినా హరీష్ రావు మాత్రం.. కెసిఆర్ వెంటనే నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయనది కీలక పాత్ర. అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదు అనేది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.

Also Read : ఐదేళ్ల తర్వాత మేలుకుంటున్న మేధావులు..!

దీనిపై కొన్ని స్థానిక పత్రికలు కూడా హరీష్ రావు సొంత పార్టీ పెట్టబోతున్నారని.. టిడిపిలో చేరబోతున్నారని ఏదో రకంగా కథనాలను వండి వార్చుతున్నాయి. దీని వెనక వాస్తవం ఎంతుంది అనేది తెలియకపోయినా.. జరుగుతున్న హడావుడి మాత్రం గులాబీ పార్టీలో ఏదో తేడా కొడుతుంది అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

Also Read : టీడీపీలో నం.3 ఎవరో తెలుసా..?

హరీష్ రావు విషయంలో ముఖ్యంగా కేటీఆర్ ఆయన సోదరి కవిత కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేది గులాబీ పార్టీలో కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కెసిఆర్ వెంట నిలబడ్డ హరీష్ రావుకు గుర్తింపు దక్కడం లేదు అనేది వారి ఆందోళన. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా సరే.. మీడియాలో ఏదో ఒక కథనం వస్తున్నా సరే.. గులాబీ పార్టీ పెద్దలనుంచి ఎటువంటి క్లారిటీ బయటకు రావడం లేదు. దాదాపు వారం పది రోజుల నుంచి హరీష్ రావు విషయంలో ఏదో ఒక కథనం సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. హరీష్ రావు గాని కేటీఆర్ గానీ లేదంటే ఇతర గులాబీ పార్టీ నాయకులు గాని దీనిపై స్పందించడం లేదు.

Also Read : కావలి మాజీ ఎమ్మెల్యేకి మూడిందా..?

ఇటీవల కాలంలో కాస్త హరీష్ రావును కవిత, కేటీఆర్ ఇద్దరూ కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేశారనేది ప్రధానంగా వినపడుతోంది. పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో హరీష్ రావు దూకుడుగా వ్యవహరించలేకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు కెసిఆర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేక సైలెంట్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్