Tuesday, October 28, 2025 02:10 AM
Tuesday, October 28, 2025 02:10 AM
roots

టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఇల్లు గుర్తించిన నేషనల్ మీడియా

లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లాహోర్‌లో దాక్కున్న ఇంటిని నేషనల్ మీడియా గుర్తించింది. ప్రముఖ ఛానల్ ఇండియా టుడే లాహోర్ లో అతను ఉంటున్న వీడియోని బయటపెట్టింది. అతను పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మధ్య నివాసం ఉంటున్నాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి కూడా అతనే బాధ్యుడుగా భావిస్తున్నారు. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల్లో నిందితుడిగా ఉన్న సయీద్, ఏప్రిల్ 22న జరిగిన దాడిలో కూడా కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు.

Also Read : కర్రెగుట్టల్లో యుద్దమే.. రంగంలోకి 24 వేల మంది బలగాలు

అతని ఉగ్రవాద ఎల్‌ఇటి అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) ఈ దాడికి పాల్పడిందని ప్రకటన చేసింది. ఉగ్రవాదులతో సంబంధం లేని ప్రాంతంలో అతను నివాసం ఉంటున్నాడు. పెద్ద ఎత్తున జనాభా ఉంటున్న ప్రాంతంలో నివసిస్తున్నట్టు గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బహిరంగ ప్రదేశంలో ఏ విధంగా ఆశ్రయం పొందుతున్నాడో.. శాటిలైట్ ఫోటోలు, వీడియోలను ఇండియా టుడే బయటపెట్టింది. హఫీజ్‌ను రక్షించడానికి భారీగా బలగాలను కూడా మొహరించారు. ఇక అతని వ్యక్తిగత సిబ్బందితో కూడా ఇండియా టుడే మాట్లాడటం గమనార్హం.

Also Read : తర్వాతి అరెస్ట్ ఆ ఐపిఎస్..? పీఎస్ఆర్ ఏం చెప్పారు..?

ఫోటోలలో.. అతని నివాసం, మసీదు, మదర్సా ఉన్న పెద్ద భవనం, హఫీజ్ కోసం వ్యక్తిగత సౌకర్యాలతో కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ భద్రతలో ఈ అంతర్జాతీయ సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఈ వీడియో లు చూస్తే అర్ధమవుతోంది. అతను జైలులో ఉన్నాడని పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడు అనే కారణంతో అతన్ని జైలుకు పంపామని పాకిస్తాన్ చెప్తూ వస్తోంది. హఫీజ్ సయీద్ దాక్కున్న ప్రదేశం గురించి భారత ఏజెన్సీలకు తెలుసని ఇండియా టుడే ప్రస్తావించింది. గత నెలలో, హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అతని చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసిందని ఇండియా టుడే పేర్కొంది. ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా సయీద్ భద్రతను సమీక్షించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్