Wednesday, June 24, 2026 10:27 AM
Wednesday, June 24, 2026 10:27 AM

టీడీపీలో మొదలైన ఎన్నికల సందడి

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి బలోపెతంపై దృష్టి సారించింది. రాజకీయంగా ప్రస్తుతం బలంగానే కనపడుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి. దీనితో ఇక ఆలస్యం చేయకుండా.. పదవులను ఇవ్వడంతో పాటుగా కమిటీల నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. షెడ్యూల్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలోని అన్ని పదవులకు ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించారు.

Also Read : బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి

కుటుంబ సాధికార సారథులు మొదలు.. లోక్ సభ నియోజకవర్గస్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో పల్లా.. కార్యాచరణ మొదలుపెట్టారు. సంస్థాగత ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యమివ్వాలని పార్టీ నాయకులకు సూచించారు. నేతలందరినీ సమన్వయపరిచి, సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయడానికి శాసనసభ, లోకసభ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను ఏర్పాటు చేస్తారు.

Also Read : ఓఎస్డీలపై చంద్రబాబు గురి

టీడీపీ రికార్డు స్థాయిలో 1.02 కోట్లకుపైగా సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఇటీవలే పూర్తి అయింది. మే 28, 29, 30 తేదీల్లో పార్టీ పండుగ మహానాడు కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 15 లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, మహానాడులోగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటిస్తారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయి వరకు అత్యంత పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. సగటున ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ, ఒక పురుషుడు చొప్పున ఇద్దరు కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. బూత్, గ్రామ, క్లస్టర్, యూనిట్, మండల/పట్టణ/డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీలు వేయనున్నారు. నియోజకవర్గ కమిటీలు, పార్లమెంటు కమిటీలు, కొన్ని లక్షల సంస్థాగత పదవులకు టీడీపీ ఎన్నికలు నిర్వహించనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

పోల్స్