Wednesday, August 5, 2026 08:39 AM
Wednesday, August 5, 2026 08:39 AM

ఏపీలో ఐసిస్ డ్రగ్.. ఉలిక్కిపడ్డ కృష్ణా జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో మాదకద్రవ్యాల విక్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గత ప్రభుత్వంలో ఏదేచ్ఛగా మాదకద్రవ్యాలను విక్రయించారు అనే ఆరోపణలు వినిపించాయి. విజయవాడలో భారీ డ్రగ్ రాకెట్ ను కూడా అప్పట్లో గుర్తించారు. ముఖ్యంగా మెడికల్ షాపుల ద్వారా డ్రగ్ మార్కెట్ విస్తరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఐజి రవికృష్ణ నేతృత్వంలోని ఈగల్ అనే బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులను తనిఖీలు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు ఐజి రవికృష్ణ.

Also Read : ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!

ఈ సందర్భంగా అవనిగడ్డలో ఓ మెడికల్ షాప్ లో బయటపడిన మత్తుమందులను చూసి అధికారులు షాక్ అయ్యారు. అవనిగడ్డ లోని భార్గవ్ మెడికల్ షాప్ లో నిషేధిత మందులను విక్రయించడాన్ని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాదులకు ఇచ్చే మందును అవనిగడ్డల విక్రయించడం ఆశ్చర్యం కలిగించింది. ఇస్లామిక్ స్టేట్, బోకో హారం వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు.. తమ ఉగ్రవాదులకు అలసట నిద్ర వంటివి రాకుండా ఎప్పుడు ఉత్తేజంగా పనిచేసేందుకు.. ట్రెమడాల్ అనే డ్రగ్ అందిస్తోంది.

Also Read : పోలీసులకు మూడుతోంది… ప్రక్షాళన మొదలు

ఇది అనారోగ్య కారకం కావడంతో 2018లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కేవలం వైద్యుల సూచనతోనే ఈ డ్రగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా అవనిగడ్డలో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున దీనికి బానిసలుగా మారినట్లు గుర్తించారు. ఈ ఒక్క మెడికల్ షాప్ లోనే రెండేళ్లలో 55,961 మాత్రలు 2,794 ఇంజక్షన్లను విక్రయించారు. ఈ లెక్కలు చూసి అధికారులు కంగుతిన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్