Sunday, March 22, 2026 12:51 PM
Sunday, March 22, 2026 12:51 PM

పోసాని తర్వాత టార్గెట్ వీరేనా..?

వైసిపి హయాంలో చెలరేగిపోయిన ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన కొంతమందిపై ఇప్పుడు పోలీసులు గురి పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు.

Also Read : చంద్రబాబు చెప్పినా లెక్క లేదా…?

వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన సామాజికపరంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళి అరెస్టు నుంచి తప్పించుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. ఇక పోసాని కృష్ణ మురళి తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : పోసాని అరెస్ట్ తో వారిలో వణుకు మొదలైందా..?

రాంగోపాల్ వర్మ కూడా గతంలో సినిమాలు అలాగే సోషల్ మీడియా పోస్టులతో రెచ్చిపోయారు. వర్మ కూడా అరెస్ట్ నుంచి తప్పించుకుంటూ వచ్చారు. ఇక వర్మతో పాటుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. వీరిద్దరిలో ఒకరిని పక్కాగా అదుపులోకి తీసుకోవచ్చు అని తెలుస్తోంది. వీరి అరెస్టు విషయంలో ఆలస్యం జరుగుతుందని టిడిపి క్యాడర్ లో అసహనం వ్యక్తమయింది. ఇక అనూహ్యంగా పోసాని కృష్ణ మురళిని సైలెంట్ గా పోలీసులు అరెస్టు చేయడంతో.. వర్మ, పెద్దిరెడ్డి, ద్వారంపూడి, కొడాలి నాని వంటి వారి పేర్లు ఎక్కువగా తర్వాతి అరెస్ట్ విషయంలో వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్