Wednesday, February 4, 2026 09:31 PM
Wednesday, February 4, 2026 09:31 PM

జత్వాని కేసు ఆటకెక్కిందా..? తెరవెనుక ఏమి జరుగుతుంది..?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కేసుల విషయంలో టీడీపీ క్యాడర్ తో పాటుగా సామాన్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి, గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి, రఘురామ కృష్ణం రాజును కస్టడీలో కొట్టడం, హీరోయిన్ జత్వానీ ను వేధించిన కేసు.. ఇలా కొన్ని కేసుల విషయంలో పరిష్కారం వస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని పార్టీ క్యాడర్ చాలా ఆశగా ఎదురు చూస్తుంది. అయితే అనుకున్న విధంగా ఈ కేసులు మాత్రం ముందుకు వెళ్ళడం సాధ్యం కావడం లేదో.. పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదు.

Also Read : ఏపీ బడ్జెట్.. ప్రాధాన్యతలు ఇవే..!

ముందు గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి విషయంలో దూకుడుగానే వ్యవహరించినా ఆ తర్వాత స్లో అయ్యారు. తాజాగా వంశీ చేష్టలతో ఆయనను, అనుచరులను అరెస్ట్ చేసారు. ఈ కేసు విషయంలో వంశీ కి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ కూడా రద్దు చేసే విధంగా సమర్ధంగా వ్యవహరించారు. ఇక హీరోయిన్ ను వేధించిన కేసు ఏమైంది అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అప్పట్లో హీరోయిన్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కొందరిని అరెస్ట్ లు చేసారు. ఆ తర్వాత ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేసారు. ఆ కేసులో కీలకంగా ఉన్న సీతారామాంజనేయులు కనీసం ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదు. ఈ విషయంలో హైకోర్ట్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Also Read :జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?

ఆ కేసులో కీలకంగా ఉన్న విశాల్ గున్నీ, కాంతిరానా టాటాలకు బెయిల్ వచ్చింది. కానీ కేసులో పురోగతి మాత్రం కనపడలేదు. విజయవాడ నోవాటేల్ హోటల్ లో హీరోయిన్ నెల రోజుల పాటు మకాం ఉన్నారు. ఆమె తిరిగి మళ్ళీ ముంబై వెళ్ళిపోయారు. కేసు మాత్రం ముందుకు కదలలేదు. పోలీసు వర్గాల నుంచి కూడా సరైన స్పందన లేదు. మహిళా అధికారి స్రవంతి రాయ్ ఈ కేసును పర్యవేక్షించారు. కొందరు పోలీసులను అరెస్ట్ చేసారు. కానీ కేసు మాత్రం ఏ పురోగతి లేకుండా అలాగే ఉండిపోయింది. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు ఉండటంతో అధికారులే సమర్ధంగా వ్యవహరించడం లేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చి, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్