Wednesday, February 4, 2026 04:04 PM
Wednesday, February 4, 2026 04:04 PM

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. విద్యాశాఖ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తాజా ప్రకటనలో స్పష్టం చీసింది. గతంలో టీచర్లకు 45 రకాల యాప్ లు ఉండేవని, వాటన్నిటిని కలిపి ఒక యాప్ గా మార్చేసామని విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ మీడియాకు వివరించారు.

Also Read : మాజీ కాంగ్రెస్ ఎంపీల కోసం అన్న తంటాలు

అదే విధంగా త్వరలో టీచర్లు బదిలీల చట్టం తీసుకురానున్నట్లు కూడా ఆయన కీలక ప్రకటన చేసారు. తాము ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు ప్రవేశపెడతారని ఆయన తెలిపారు. ఇక వైస్ ఛాన్స్లర్ నియామకం పూర్తయిన తర్వాత అన్ని యూనివర్సిటీల కు ఏకీకృత చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇక మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తుంది విద్యాశాఖ. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది.

Also Read : అగ్ని ప్రమాదంపై వైసీపీ కామెడి ప్రకటన..!

ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. 16 వేల 247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 7,725 పోస్ట్ లు ఖాళీలు ఉండగా.. సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371 మంది ఉన్నారు. ఇక ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1781, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286 మంది ఉండగా, పిఈటిఈ లు 132 మంది, ప్రిన్సిపాల్ పోస్టులు 52 ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపిన లోకేష్.. ఇప్పుడు మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్