Wednesday, August 5, 2026 12:04 PM
Wednesday, August 5, 2026 12:04 PM

నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

ఓ వైపు అధికారం కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసిపి ఇప్పుడు జిల్లాల్లో కూడా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ నుంచి బయటికి వస్తాడో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా నుంచి కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి అలాగే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసేసారు.

Also Read: కృష్ణా జిల్లాలో కూలుతున్న వైసిపి కోట

ఇక నెల్లూరు జిల్లాలో పార్టీ నాశనానికి ఒక కీలక నేత కారణమని ఆరోపణలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి తీరుపై అక్కడి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ మండల అధ్యక్షుడు పదవిని ఆయన 50 లక్షలు అమ్ముకున్నారని ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. పలువురు నేతలకు రామిరెడ్డి ఫోన్ చేసి బెదిరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తుమ్మలపెంట సముద్ర తీరం వద్ద వైసీపీ మత్స్యకార నేతలు ఎంపీటీసీలు, సర్పంచుల సమావేశం జరిపి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నేతృత్వంలో పనిచేయకూడదని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: వైసీపీకి మరో ఎదురు దెబ్బ..?

ఇక జగన్ ను కలిసి తమ నిర్ణయం చెప్పేయాలని ఆ పార్టీ నేతలు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక నెల్లూరు జిల్లాలో కూడా ఆయన ఆధిపత్యం ఎక్కువగా కొనసాగుతుందని అంటున్నారు. పార్టీకి పెద్దదిక్కు ఎవరు జిల్లాలో లేకపోవడం, అటు మేకపాటి కుటుంబం కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడంతో రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోగా మరికొంతమంది నేతలు రామిరెడ్డి తీరు కారణంగా బయటికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే కొంతమంది నేతలకు సమాచారం కూడా పంపించారట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్