Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

పుష్పకు హ్యాండిచ్చిన త్రివిక్రమ్..?

పుష్ప సీరీస్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ నేషనల్ లెవెల్ లో పెరిగిపోయింది. అల్లు అర్జున్ సినిమా అంటే నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అప్డేట్స్ కోసం నార్త్ ఇండియన్స్ పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ జనాల్లో కూడా ఆసక్తి మొదలయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Also Read : రాజమౌళికి కేరళ యాక్టర్ షాక్…?

దీనితో నాలుగో సినిమా కోసం జనాలు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్య చాన్స్ కనబడటం లేదనే ఒపీనియన్ వినపడుతోంది. అల్లు అర్జున్ కాస్త డిస్టర్బ్ గా ఉండడం, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ ప్రాజెక్టుపై అంత సీరియస్ గా ఫోకస్ చేయకపోవడంతో ఆలస్యం అవుతుంది. వాస్తవానికి జనవరిలో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరిలో మొదలు పెడతారని అందరూ భావించారు. కానీ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ వస్తుంది. ఈ సినిమా విషయంలో నిర్మాతలు కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు.

Also Read : వైఎస్ ఫ్యామిలీ సేవలో కూటమి సర్కార్..

పుష్ప సినిమా తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో నిర్మాతలు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి భయపడుతున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. చెంగిజ్ ఖాన్ అనే ఓ రాజు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేయాలని త్రివిక్రమ్ భావించాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా మొదలు పెట్టకపోవడమే మంచిదనే ఒపీనియన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు అల్లు అర్జున్ కూడా వేరే ప్రాజెక్టు పై దృష్టిపెట్టినట్లు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. మరి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారా లేదంటే పక్కన పెడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్