Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

ఏఐతో నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకే ఒక పదం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు టీవీ నుంచి విమానం వరకు ఇలా ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయ్యి స్మార్ట్ గా సేవలందిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సరైన మానవ వనరులు లేకపోవడం కారణంగా ఇబ్బందులు పడుతున్న ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి.

Also Read : టీడీపీ లీగల్ సెల్ నిజంగానే బలహీనమా..?

ఆరు నెలల పాటు కష్టపడి చేయాల్సిన ప్రాజెక్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. దీనితో ఎవరి మీద ఆధారపడకుండా ఇంట్లోనే మనకు కావాల్సింది పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే ఓ చిన్నారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు కాకపోయినా నెలకు లక్షన్నరకు పైగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ గురించి తక్కువే తెలిసిన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేర్చుకున్నది ఉపయోగించి నెలకు దాదాపుగా 1.5 లక్షలు సంపాదిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.

Also Read : బ్రేకింగ్: మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం

దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాకు చెందిన ఆ చిన్నారి రెండు నెలలుగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. పలు వెబ్ సైట్లను తయారు చేసి.. వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫారం కలిగి ఉన్న ఒక రెడ్డీట్ యూజర్ మస్క్ అనే యుజర్ ను పరిశీలించారు. అతను తరచుగా క్రెడిట్స్ తీసుకుని వెబ్ సైట్స్ ను తయారు చేస్తున్నాడు. ఆ మస్క్ అనే పేరు ఉన్న యుజర్ ఎవరా అని గమనిస్తే, ఆ పిల్లాడు ఒక స్కూల్ స్టూడెంట్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు.

Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు

ఆ పిల్లోడు దాదాపు ప్రతిరోజు వెబ్ సైట్స్ ను తయారు చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అయ్యాడు. రెండు నెలల్లో మస్క్ ఎనిమిది వెబ్ సైట్స్ ను తయారు చేసి వాటిని విక్రయించాడు. ఒక్క వెబ్ సైట్ తయారీకి ఆ పిల్లాడు 250 నుంచి 300 డాలర్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. అంటే మన కరెన్సీ లో 25 వేల వరకు తీసుకుంటున్నాడు. నెలకు లక్షన్నర పైనే వసూలు చేస్తున్నాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వాడుతున్నందుకు ఆ పిల్లాడు నెలకు చేస్తున్న ఖర్చు కేవలం 2500 మాత్రమే. దీంతో ప్రస్తుతం ఈ పిల్లవాడి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకుంటే ఇలాంటి అద్భుతాలే చేయవచ్చని సోషల్ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్