అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల తప్పుడు ప్రచారానికి బ్రేకులు వేయడంలో టీడీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారు. 2014-19 మధ్య కాలంలో టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా అదే అబద్ధపు ప్రచారంతో ఎదురు దాడి చేశారు. చివరికి ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు కూడా తన అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో అదే తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చిపోతున్నా కూడా.. కూటమి ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప.. కట్టడికి కనీస చర్యలు తీసుకోవటం లేదు అనేది అక్షర సత్యం.
Also Read : జగన్ ఢిల్లీ ప్రయత్నాలు ఫలించేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ పర్యటించారు. ఈ పర్యటనతో ప్రపంచ దేశాల దృష్టిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఒకరోజంతా బిల్ గేట్స్ ఏపీలో గడిపారు. దీంతో ఏపీ గురించి ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు రాస్తోంది. నిజానికి బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఫోర్బ్స్ పత్రికకు కూడా ఆయన పేరును మొదటి స్థానంలో ముద్రించి బోర్ కొట్టి ఉండవచ్చు, ఎందుకంటే ఆయన ఏకంగా 18 సార్లు ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా నిలిచి అజేయమైన రికార్డు సృష్టించారు. అందులో 13 సార్లు వరుసగా అగ్రస్థానాన్ని అలంకరించిన గేట్స్, నేడు కేవలం ఒక ధనవంతుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప దాతగా, దూరదృష్టి ఉన్న మార్పు కోరే వ్యక్తిగా కనిపిస్తున్నారు. తన సంపదలో 99 శాతం సమాజానికే ఇచ్చేస్తానని ప్రకటించిన ఈ టెక్ దిగ్గజం.
బిల్ గేట్స్ ప్రస్తుతం తన సంపదను ప్రధానంగా మూడు మార్గాల్లో ఖర్చు చేస్తున్నారు. 2045 నాటికి తన ఫౌండేషన్‌ను మూసివేసే లక్ష్యంతో ఏటా 9 బిలియన్ డాలర్ల నిధులను ఆరోగ్యంపై వెచ్చిస్తూ, ‘హారిజన్ 1000’ ద్వారా పేద దేశాలకు ఏఐ వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. అలాగే భూతాపాన్ని తగ్గించేందుకు ‘బ్రేక్ త్రూ ఎనర్జీ’ ద్వారా క్లీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే బిల్ గేట్స్‌ను ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబు.. క్లీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను వివరించారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో ఏఐ వైద్య సేవలు అందించేందుకు ఒప్పించారు కూడా.
Also Read : భారత్ – పాక్ మ్యాచ్ ఆదాయం ఎన్ని వేల కోట్లు అంటే..?
అయితే దీనిపై వైసీపీ అనుకూల సోషల్ మీడియా తనదైన శైలిలో తప్పుడు ప్రచారం చేస్తోంది. బిల్ గేట్స్‌కు మకిలి అంటించేందుకు ఉదయం నుంచి నానా పాట్లు పడింది. వైసీపీ అనుకూలం అని ముద్రపడిన జర్నలిస్టు సాయి.. దోమలు సృష్టిస్తున్న గేట్స్ అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బిల్ గేట్స్‌ను ఒక పెద్ద ఫ్రాండ్ అంటూ మరో వీడియో చేశారు. “పెద్ద దొంగ వాడు, ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్న పెద్ద శాడిస్టు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటున్నారు. దేశానికే ద్రోహి”అంటూ ఘాటు వ్యాఖ్యలతో వీడియో చేశారు. నిజానికి సాయి గురించి ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేటీఎం జర్నలిస్టు అంటూ వ్యాఖ్యానించిన సాయిరెడ్డి.. ప్రతి నెలా సాయికి వైసీపీ డబ్బులు చెల్లిస్తోందని ఆరోపించారు కూడా.
ఇక వైసీపీ అనుకూల ఉత్తరాంధ్ర నౌ అయితే.. “పిస్టిన్ ఫైళ్లలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్‌కు సాదర స్వాగతం పలికి క్యాబినెట్ మంత్రులు” అంటూ మంత్రులులోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నిజానికి ఉత్తరాంధ్ర నౌ అనేది ఇప్పుడు తొలిసారి విమర్శలు చేయలేదు. వైసీపీకి అనుకూలంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పదే పదే విమర్శలు చేస్తుంది. టార్గెట్ టీడీపీ అన్నట్లుగా విమర్శలు చేస్తున్నా కూడా.. ఇప్పటి వరకు దానిని కట్టడి చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. వైసీపీ సోషల్ మీడియా, అనుకూల దూకుడుకు బ్రేకులు వేయటంలో టీడీపీ పూర్తిగా ఫెయిల్ అనేది మరోసారి రుజువైంది.

