ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా జగన్ కు కీలక నేతలు గుడ్ బై చెప్తూ వస్తున్నారు. జగన్ విషయంలో సీరియస్ గా ఉన్న నేతలు కొందరు నేతలు కూటమి పార్టీలతో చర్చలు జరుపుతూ పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు అనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు ఇప్పటికే జగన్ కు గుడ్ బై చెప్పారు. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు.
ఇప్పుడు ఓ అగ్ర నేత చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాద రావు ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్దమైనట్టు సమాచారం. ఇటీవల అశోక గజపతి రాజుని కూడా ఆయన కలిసి మనసులో మాట చెప్పారట. ముందు జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకుని ప్రయత్నాలు చేసినా తర్వాత మనసు మార్చుకుని టీడీపీలోకి అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ మాత్రం జనసేనలో జాయిన్ అయ్యేందుకు సిద్దమయ్యారు.
Also read : డీలా పడ్డ వైసీపీ శ్రేణులు.. కారణం ఏంటంటే..?
ఆయనతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక కీలక నేత కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందు దసరా తర్వాత అనుకున్నా… దీపావళి తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారట. దీనికి సంబంధించి జగన్ కు సమాచారం ఉన్నా ఆయన ఆపే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. అటు బొత్సా కూడా ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును జనసేనలో వెతుక్కుంటున్నారు అని సమాచారం వస్తోంది. మరి ఇంకెంత మంది నేతలు బయటకు వస్తారో చూడాలి.