Friday, September 12, 2025 09:06 PM
Friday, September 12, 2025 09:06 PM
roots

అన్న సేవ నుంచి జన క్షేత్రానికి, మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై

తెలుగుదేశం పార్టీ గేట్లు మూసినా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరికలు మాత్రం ఆగడం లేదు. రాజీనామా చేసే వాళ్ళు చేస్తుంటే ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి నెల రోజులు కూడా గడవక ముందే మాజీ ఎమ్మెల్యేలు జగన్ కు దండం పెట్టి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కీలక నేతలుగా ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు జగన్ కు గుడ్ బై చెప్పడం ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్న అంశం.

జగన్ వైఖరి నచ్చక, కేసుల భయంతో చాలా మంది ఇప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఏకంగా పది మంది మాజీ ఎమ్మెల్యేలు జగన్ కు గుడ్ బై చెప్పడం ఆందోళన కలిగించే అంశమే. వీళ్ళు అందరూ జనసేన పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే వీళ్ళు అందరూ జాయిన్ అవుతున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రంగం సిద్దం చేసుకోగా ఏ హడావుడి లేకుండా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీ మారుతున్నారు.

Read Also : బాబుకి మొదటిసారి కలిసి వస్తున్న పొత్తు ఫలాలు

అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య ఇప్పటికే రాజీనామా చేయగా పార్టీలో జాయిన్ కావడం ఆలస్యం అయింది. దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఇప్పుడు జగన్ కు గుడ్ బై చెప్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువ నేత కూడా జనసేనలో జాయిన్ అయ్యేందుకు సిద్దం కావడం వైసీపీ నేతలను భయపెడుతున్న అంశంగా చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్