డ్రామా బయటపడుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారా… అధికారంలోకి వచ్చేందుకు చేసిన కుట్రలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయని బెంబేలెత్తుతున్నారా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం చేసిన కుట్ర కోణం బయటకు వస్తుందని వైసీపీ నేతలు ముందుగానే ఊహిస్తున్నారు. అందుకే ఆ విషయం బయటపడకుండా ముందే జాగ్రత్తలు పడుతున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. 2018లో జరిగిన కోడి కత్తి దాడి కేసులో అసలు సూత్రదారులు బయటకు వస్తారనే భయం ఇప్పుడు వైసీపీ నేతల్లో కనబడుతోంది. అయితే ఆ విషయం బయటపడకుండా ముందుగానే కొత్త నాటకానికి తెర లేపారు. కోడికత్తి లాంటి డ్రామానే మరోసారి ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read : వైసీపీలో సజ్జల ముసలం..!
2018 జనవరి 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ కోర్టులో వాయిదాకు హాజరవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్‌లో ఎదురు చూస్తున్న సమయంలో జనుపల్లి శ్రీను అనే యువకుడు కోడి కత్తితో జగన్ పై దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ వైపు భుజానికి చిన్న గాయమైంది. అయినా సరే జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. దాడి చేసిన శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కోడికత్తి దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందంటూ ప్రచారం చేశారు. అసలు జగన్‌ను హత్య చేసేందుకు ఈ దాడి జరిపించారని ఆరోపించారు కూడా. చివరికి ఆ సానుభూతితోనే 2019 ఎన్నికల్లో ఓట్లు కూడా రాబట్టారు.
Also Read : దొరకని కసిరెడ్డి.. మళ్ళీ విజయసాయి రెడ్డికి షాక్
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల తీరు పూర్తిగా మారిపోయింది. కోడికత్తి దాడి వెనుక టీడీపీ కుట్ర ఉంది అని ఐదేళ్లు రుజువు చేయలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. అదే సమయంలో దాడి చేసిన వ్యక్తి బయటకు వస్తే.. నిజాలు ఎక్కడ బయటకు వస్తాయో అనే భయంతో.. జనుపల్లి శ్రీనుకు బెయిల్ రాకుండా చేశారు. చివరికి జనుపల్లి శ్రీనుకు కొందరు దళిత సంఘాల నేతలు అండగా ఉండటంతో.. అతని కుటుంబం న్యాయపోరాటం చేయగలిగింది. కోడి కత్తి శ్రీనును బయటకు రాకుండా వైసీపీ ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేసింది. కానీ చివరికి న్యాయమే గెలిచినట్లు… కోడికత్తి దాడి కేసులో శ్రీనుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
తాజాగా కోడికత్తి దాడి చేసిన జనుపల్లి శ్రీనును రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు కలిశారు. అమలాపురంలో శ్రీను ఇంటికి స్వయంగా వెళ్లారు. వైఎస్ జగన్‌కు కోడికత్తి శ్రీను వీరాభిమాని అని.. ఆయన కోసం బలైన మొదటి వ్యక్తి కూడా శ్రీను అని ఏబీ వెంకటేశ్వర్రావు ఆరోపించారు. ఐదేళ్ల పాటు జైలులో ఉంచి.. శ్రీను జీవితాన్ని జగన్ నాశనం చేశారన్నారు. ఇప్పటికీ కోర్టుకు హాజరుకాకుండా జగన్ తప్పించుకుంటున్నారని.. కోర్టుకు హాజరు కాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసు నీరుగార్చేందుకు జగన్ యత్నిస్తున్నాడన్నారు. శ్రీనుకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. జగన్ బాధితులకు అండగా ఉంటానని ఏబీ వెంకటేశ్వర్రావు హామీ ఇచ్చారు.
Also Read : ఎంపీకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
కోడికత్తి శ్రీనును ఏబీవీ కలవడం వైసీపీ నేతలను భయపెడుతోంది. “పాత కుట్రకు మళ్లీ పదును” అంటూ వైసీపీ కరపత్రం సాక్షిలో పెద్ద వార్త రాశారు. ఇక ఏబీవీపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబీ వెంకటేశ్వర్రావు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై కోడికత్తితో దాడికి యత్నించారని… ఇప్పుడు ఆయన భద్రత కుదించి హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రాప్తాడులో హెలికాఫ్టర్ దగ్గరకు జనాలు వచ్చేశారని.. అక్కడ జగన్‌పై ఎవరైనా దాడి చేస్తే పరిస్థితి ఏమిటంటూ విమర్శలు చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి వివేకాను హత్య చేసినట్లు ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ పై బయటే ఉన్నాడని.. ఈ హత్య కేసులో ప్రమేయం లేని వారిని ఇరికించాలని చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
Also Read : ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫ్లైట్ కష్టాలు
ఈ ఆరోపణలపై ఏబీవీ ధీటుగా స్పందించారు. “కోడికత్తి శ్రీనుకి జగన్ మోహన్ రెడ్డి వల్ల జరిగిన అన్యాయం గురించి, ఈ కేసులో అన్ని విషయాల గురించి ఓపెన్ డిబేట్‌కు నేను సిద్ధం. మీ ఛానల్‌లోనే పెట్టండి. డేట్, టైమ్ మీ ఇష్టం..” అంటూ సాక్షి యాజమాన్యానికి సవాల్ విసిరారు. అలాగే గడికోట శ్రీకాంత్ రెడ్డికి కూడా ఘాటుగానే బదులిచ్చారు. “సాక్షి ఛానల్ ఓపెన్ డిబేట్ పెట్టని కోరాను. మీరు కూడా పాల్గొనవచ్చు.” అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఏబీవీ సూచించారు. ఏబీ చేసిన సవాల్‌కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. కోడికత్తి దాడి కేసులో నిజానిజాలు తెలుసుకోవాలని ఉంది.. డిబేట్ ప్లీజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏబీవీ ఛాలెంజ్‌ను వైసీపీ నేతలతో పాటు సాక్షి యాజమాన్యం స్వీకరిస్తుందా.. ఏబీవీతో డిబేట్‌కు వైసీపీ నేతలు సిద్ధమా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.