Wednesday, November 18, 2026 05:36 PM
Wednesday, November 18, 2026 05:36 PM

జగన్‌ని భయపెడుతున్న అమరావతి ఎక్స్‌ప్రెస్..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు హైస్పీడ్‌లో జరుగుతున్నాయి. ఐకానిక్ సెక్రటేరియట్లు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నిర్మాణ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు విధించారు. యుద్ధప్రాతిపదికన రాజధాని పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ కావడంతో క్షేత్రస్థాయిలో పనులు జోరందుకున్నాయి.

Also Read : జడ్పీ ఛైర్మన్ల సందడి.. కూటమి అగ్ర నేతల కీలక భేటీ..!

అమరావతిలో ఇప్పటికే పలు కీలక నిర్మాణాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. రాజధాని అభివృద్ధిలో ప్రధానమైన ఏపీ CRDA ప్రధాన కార్యాలయం ఏడాది క్రితమే ప్రారంభం కాగా, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన 288 ఫ్లాట్లతో కూడిన 6 అపార్ట్‌మెంట్లు సిద్ధమయ్యాయి. 144 మంది ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగుల నివాసాల నిమిత్తం చేపట్టిన AIS భవన సముదాయం తుది మెరుగులు అద్దుకుంటోంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మించిన 36 బంగ్లాల ప్రారంభోత్సవం కూడా ఇటీవల లాంఛనంగా పూర్తయింది.

మంత్రుల కోసం నిర్మిస్తున్న 35 నివాస భవనాల పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, ప్లంబింగ్, గార్డెనింగ్ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. వీటితో పాటు 1,968 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 21 టవర్లు, గెజిటెడ్ టైప్-1 అధికారుల కోసం 384 యూనిట్లతో 4 టవర్లు, టైప్-2 అధికారుల కోసం 336 యూనిట్లతో 4 టవర్లు, గ్రూప్-డీ ఉద్యోగుల కోసం 720 యూనిట్లతో 6 టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఒకటి రెండు మినహా మిగిలిన భవనాలన్నీ డిసెంబరు చివరి నాటికి, మిగిలినవి ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని, పూర్తయిన భవనాలను ఈ నెల 11 నుంచే ఆయా శాఖలకు దశల వారీగా అప్పగిస్తామని అధికారులు వివరించారు.

Also Read : వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ షాకింగ్ న్యూస్..!

అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డిలో భయం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు అమరావతి ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుండటం, భవనాలు ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి వస్తుండటం జగన్‌కు రాజకీయంగా మింగుడుపడటం లేదని సమాచారం. అమరావతి పూర్తయితే రాష్ట్రంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన జగన్‌ కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైఎస్ జగన్ అక్రమాస్తుల...

హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో పులివెందుల...

బండ్ల గణేష్‌కు ఒంగోలు...

టాలీవుడ్ బడా నిర్మాత, నటుడు బండ్ల...

అమరావతిపై వైసీపీ కుట్రలు.....

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ మరోసారి...

వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ...

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు...

జడ్పీ ఛైర్మన్ల సందడి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ...

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

పోల్స్