భారతీయ పౌల్ట్రీ రంగంలో సరికొత్త చరిత్రకు తెరలేచింది. దేశాన్ని తరచూ వణికిస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (బర్డ్‌ఫ్లూ) మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రక ముందడుగు వేసింది. కోళ్లను ప్రాణాంతక ‘H5N1’ వైరస్ నుంచి రక్షించేందుకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. భోపాల్‌లోని ప్రతిష్టాత్మక ‘ఐకార్-నిషాద్’.. ICAR-NIHSAD – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెసెస్ సంస్థ ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసింది.
Also Read : వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ షాకింగ్ న్యూస్..!
ఈ నెల 20వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సరికొత్త స్వదేశీ ‘H5N1’ వ్యాక్సిన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో కోళ్ల మరణాలకు ప్రధాన కారణమవుతున్న H5N1 వైరస్ స్ట్రెయిన్‌ను అణచివేయడంలో ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి కేవలం పక్షులను నిర్మూలించడం, రవాణా నిబంధనలు వంటి తాత్కాలిక చర్యలపైనే దేశం ఆధారపడాల్సి వచ్చేది.
Also Read : జడ్పీ ఛైర్మన్ల సందడి.. కూటమి అగ్ర నేతల కీలక భేటీ..!
అయితే, ఈ స్వదేశీ వ్యాక్సిన్ ఆవిష్కరణతో పౌల్ట్రీ రంగానికి శాశ్వత రక్షణ లభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పౌల్ట్రీ రంగాన్ని రక్షించడంతో పాటు, బర్డ్‌ఫ్లూ వైరస్ జంతువులకు, మనుషులకు సోకకుండా నివారించడంలో ఈ వ్యాక్సిన్ రక్షణ కవచంలా నిలవనుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ద్వారా రైతులకు జరిగే కోట్లాది రూపాయల ఆర్థిక నష్టాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు సుస్థిర భద్రత చేకూరనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన ఈ టీకాను వాణిజ్యపరంగా పంపిణీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించకుండా పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కూడా అధికారులు నిర్ణయించారు.


