ఎన్నికల్లో కష్టపడి గెలిచినా కూడా… పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందే… ఆ మాత్రానికి గెలవటం ఎందుకు… ప్రస్తుతం వైసీపీలో ఓ ఎమ్మెల్యే తన అనుచరుల దగ్గర చెప్పిన మాటలివి. కూటమి సునామిని తట్టుకుని గెలిచినప్పటికీ… ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీలో నిరసన సెగ బాగా తగులుతోంది. ఓ వైపు అధినేత తీరుతో సభలో అధ్యక్ష అనే కోరిక తీరకపోవడం… మరోవైపు సొంత నియోజకవర్గంలో సీనియర్ నేత చాపకింద నీరులో అసమ్మతిని పెంచి పోషిస్తుండంటంతో.. ఎందుకొచ్చిన రాజకీయాలురా నాయనా అంటూ తల పట్టుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే. పైకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ… తాజాగా తన అనుచరులతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో మాత్రం… నేను వైసీపీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే… గౌరవమేది అని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇంతకీ ఆయన ఎవరో కాదు… యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.
Also Read : ఒక్క వీడియోతో లోకేష్ ఆన్సర్ ఇచ్చేసారా..?
వైసీపీ తరఫున గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో చంద్రశేఖర్ ఒకరు. వాస్తవానికి చంద్రశేఖర్ గెలుపు టీడీపీలో ఓ సీనియర్ నేత వల్ల అనేది బహిరంగ రహస్యం. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి మార్చారు జగన్. దీంతో యర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. దీంతో నియోజకవర్గంలో తన పట్టు జారిపోతుందనే భయంతో.. సురేష్ వర్గం తాటిపర్తికి దూరంగా ఉంది. ఇదే సమయంలో టీడీపీలో ఓ కురు వృద్ధుడి పుణ్యమా అని 3 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు చంద్రశేఖర్. పేరుకు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పటికీ… పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం వల్ల ప్రజల్లోకి రావాలంటే ముఖం చెల్లటం లేదు. ఇదే సమయంలో నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజా సమస్యల పరిష్కారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు అసెంబ్లీకి పోలేక, ఇటు నియోజకవర్గంలో తిరగలేక రెంటికి చెడిన రేవడి మాదిరిగా తాటిపర్తి చంద్రశేఖర్ పరిస్థితి మారిపోయింది.
Also Read : ఏపీ కేబినేట్ లో కీలక నిర్ణయాలు ఇవే
ఒకదశలో చంద్రశేఖర్ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అదేం లేదని పైకి మాత్రం గొప్పగా పార్టీ అధినేత జగన్‌కు హామీ ఇచ్చారు. అయితే వై పాలెం నియోజకవర్గంలో తన ఉనికి కోల్పోతుందనే భయంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కాపురంలోని జార్జ్ కాలేజీలో తన వర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చంద్రశేఖర్‌పై వ్యతిరేక ప్రచారం చేయాలని తన వర్గానికి ఆదేశించారు కూడా. రాబోయే ఎన్నికల్లో మళ్లీ తనే వై పాలెం నుంచి పోటీ చేస్తానని… కాబట్టి… చంద్రశేఖర్‌తో ఉండటం వల్ల నేతలకు ఎలాంటి ఉపయోగం లేదని కూడా సూచించారట. దీంతో సురేష్‌తో సన్నిహితంగా కొందరు నేతలు.. సైలెంట్‌గై టీడీపీలో చేరిపోయారు.
Also Read : వాళ్ళు అమెరికా వదిలేయాల్సిందేనా…? సంచలనంగా ట్రంప్ నిర్ణయం…!
వాస్తవానికి వైసీపీ తరఫున గెలిచిన మొదటి రోజు నుంచే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. బాలినేని వెంట జనసేనలో చేరుతారని కొన్ని రోజులు టాక్ నడిచింది. తాజాగా టీడీపీ అనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైన చంద్రశేఖర్ వైసీపీ కండువా వేసుకోలేదు. దీంతో పార్టీ మారుతున్నావా అని జగన్ కూడా ప్రశ్నించారు. దీంతో… అబ్బే అదేం లేదన్నా అంటూ హడావుడిగా పక్కనున్న వారి కండువా తీసి మెడలో వేసుకున్నారు చంద్రశేఖర్. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో కూటమి సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆధారాల్లేని విమర్శలకు జవాబు చెప్పాలంటూ ఎమ్మెల్యేకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.