Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

చావులోనూ రాజకీయమే..!

పాస్టర్ ప్రవీణ్ పగడాల.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న సమయంలో మృతి చెందాడు. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై బంధువులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు కూడా. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు కొంతమంది దీనిని ఓ అవకాశంగా మార్చుకున్నారు. మరికొందరు ఇదే తమకు గోల్డెన్ ఛాన్స్ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. సీనియర్ రాజకీయ నేతలు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేందుకు దీనిని ఒక అస్త్రం కింద వాడుతున్నారు.

Also Read : రష్మిక దూకుడుకి బ్రేకులు పడ్డాయా..?

వాస్తవానికి ప్రవీణ్ పగడాల ఒక మత ప్రభోదకుడు. మతం గురించి ప్రచారం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇతర మతాలను కించపరచడమే పెద్ద తప్పు. ఈ విషయంలో ప్రవీణ్ ఎన్నోసార్లు ఇతర మతాలను కించపరిచే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నోరు పారేసుకున్నారు కూడా. వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ప్రవీణ్ పగడాలకు గుర్తింపు వచ్చింది కూడా. అందుకే అతని చావుకు కొంతమంది మతం రంగు పులుముతూ.. రాజకీయం చేస్తున్నారు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రవీణ్‌ను కూటమి ప్రభుత్వమే హత్య చేసిందంటూ మతం ముసుగు వేసుకున్న వైసీపీ అభిమానులు మైకుల ముందు గగ్గొలు పెడుతున్నారు కూడా.

Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసు.. ఏపీ పోలీసుల తీరుపై ప్రసంశలు

ఇక ఇక్కడ మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ కూడా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి జరిగిన తర్వాత మరో ఇద్దరు పాస్టర్లు మరణించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదం వల్లే మృతి చెందారు. అయితే ఆ ఇద్దరు తెలంగాణలో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. అయితే ఆ ఇద్దరి మరణాలపై ఎవరూ నోరు ఎత్తడం లేదు. కానీ ప్రవీణ్ పగడాల మృతిని మాత్రమే హత్యగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే… ఇది ఏపీలో జరిగింది కాబట్టి.

Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న బ్యాడ్ టైం

మార్చి 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరిన ప్రవీణ్… అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి సమీపంలో మృతి చెందారు. ఈ విషయాన్ని 25వ తేదీ ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కరుణాకర్ అనే పాస్టర్ కరీంనగర్ – రామగుండం మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత 27వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర జోసఫ్ అనే మరో పాస్టర్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు పాస్టర్లు మరణించారు. అయితే కరుణాకర్, జోసఫ్ తెలంగాణలో చనిపోయారు. ప్రవీణ్ మాత్రమే ఏపీలో మృతి చెందారు. ప్రవీణ్‌ మరణంపై మాత్రమే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు.. మరి మిగిలిన ఇద్దరి గురించి ఎందుకు ప్రస్తావించటం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Also Read : హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!

కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండటం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కారణంతోనే ఇలా తప్పుడు ఆరోపణలతో ఒక వర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. విషయాన్ని పెద్దదిగా చేస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రవీణ్ పగడాల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జనగణనలో తెలంగాణలో క్రిస్టియన్లు అరకొరగానే ఉన్నారంటూ లెక్కలు చూపించారు. మరి ఇంతమంది ఎక్కడ నుంచి వచ్చారనేది సామాజికవేత్తల ప్రశ్న. ప్రమాదాలను అడ్డుపెట్టుకుని మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పాస్టర్లు ప్రమాదంలో మృతి చెందితే.. తెలంగాణలో ఒకలా.. ఏపీలో ఒకలా వ్యవహరించే విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో ఇద్దరు చనిపోయినా కూడా… ఎవరు నోరెత్తడం లేదు… అదే ఏపీలో ఒకరు చనిపోతే మాత్రం.. కూటమి ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారు… ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇదెక్కడి లాజిక్ అనేది ఎవరికీ అంతుబట్టిని ప్రశ్న.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్