Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

ఎన్టీఆర్‌ను రెచ్చగొడుతున్న వైసీపీ..!

మాకు అధికారమే పరమావధి… పదవుల కోసం ఏమైనా చేస్తాం… ఎంతకైనా దిగజారుతాం అంటున్నారు వైసీపీ నేతలు. పట్టుమని పది సీట్లు కూడా రాలేదు… ఘోరంగా ఓడిపోయి పది నెలలు కూడా కాలేదు.. కానీ అప్పుడే అధికారంలోకి వస్తామంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇంకో నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం కూలిపోతుందంటూ పోలీసులకు, అధికారులకే వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పదవి లేకపోతే అన్నకు నిద్ర పట్టదంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పదవి కోసం సొంత చెల్లిని, ఆస్తి కోసం కన్నతల్లినే జగన్ తరిమేశారనేది కూటమి నేతల మాట. అలాంటి జగన్ పార్టీ నేతలు ఇప్పుడు నందమూరి కుటుంబంలో విభేదాలు రేపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : గవాస్కర్ నోటి దూల.. బోర్డుకు రోహిత్ కంప్లైంట్

వాస్తవానికి సినీ రంగంలో ఎలాంటి విభేదాలు లేని కుటుంబం అంటే అది నందమూరి వారసులే. ఇప్పటికీ కుటుంబ సభ్యులంతా తరచూ కలుస్తూనే ఉంటారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత తన కెరీర్‌పై దృష్టి పెట్టిన ఎన్టీఆర్… రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సోదరుడు కల్యాణ్ రామ్ కూడా సినిమా ప్రొడక్షన్, యాక్టింగ్‌లో బిజీబిజీగా ఉంటున్నారు. అదే సమయంలో అవకాశం ఉన్నప్పుడు బాబాయ్ బాలకృష్ణను కలుస్తున్నారు కూడా. ఇక ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో కూడా అన్నదమ్ములిద్దరూ కలిసే పాల్గొన్నారు.

Also Read : గల్లా జయదేవ్ కి రాజ్య సభ సీటు దక్కేనా?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే తారక్ సోషల్ మీడియా వేదికగా బాల బాబాయ్ మీకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. సినిమా రంగంతో పాటు మీరు చేస్తున్న సేవలకు సరైన గుర్తింపు వచ్చిందన్నారు తారక్. ఇక బాలకృష్ణకు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి కుటుంబానికి చెందిన కుమారులు, కుమార్తెలు పత్రికలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఇందులో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అంటూ రాశారు. నందమూరి తారక రామారావు కుమారుడు, కోడళ్లు, కుమార్తెలు అల్లుళ్ల పేర్లతో పాటు బాలకృష్ణ కుమార్తెలు, అల్లుళ్లు, కుమారుడి పేరు మాత్రమే ఇందులో రాశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌కు స్థానం లేదంటూ ప్రచారం చేస్తున్నారు.

Also Read : నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్

వాస్తవానికి పత్రికలో వచ్చిన పేర్లల్లో ఎన్టీఆర్ మనవళ్ల పేర్లు ఎక్కడా రాయలేదు. కేవలం బాలకృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్, కుమారుడు మోక్షజ్ఞ తారక రామతేజ పేర్లు మాత్రమే రాశారు. అంతే తప్ప… అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల పిల్లల పేర్లు రాయలేదు. కానీ ఇంత చిన్న లాజిక్ మిస్సైన వైసీపీ నేతలు… నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను కుటుంబ సభ్యులుగా గుర్తించలేదంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సోదరుల జాబితాలో హరికృష్ణ పేరుతో పాటు, భార్య లక్ష్మి పేరు కూడా ఉంది. తండ్రి కుటుంబసభ్యుడు అయితే… కుమారులు కాకుండా పోతారా అనే చిన్న లాజిక్కును వైసీపీ బ్యాచ్ మిస్సయ్యింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్