Wednesday, August 5, 2026 10:11 AM
Wednesday, August 5, 2026 10:11 AM

గవాస్కర్ నోటి దూల.. బోర్డుకు రోహిత్ కంప్లైంట్

సాధారణంగా మాజీ క్రికెటర్లు పదే పదే ప్రస్తుత క్రికెటర్ల గురించి ఏదోక సందర్భంలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది కాస్త శృతి మించుతోంది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. రిశబ్ పంత్ అవుట్ అయిన ఆతర్వాత అతన్ని ఉద్దేశించి స్టుపిడ్ అంటూ కామెంట్స్ చేసాడు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గవాస్కర్ ఒత్తిడి కారణంగానే అతను తన సహజ ఆట ఆడలేదని.. కొందరు కామెంట్స్ కూడా చేసారు.

Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

ఇక కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా ఇదే విధంగా కామెంట్స్ చేసాడు గవాస్కర్. దీనిపై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. తాజాగా బోర్డుకు ఫిర్యాదు చేసాడు. చివరి టెస్ట్ లో రోహిత్ తప్పుకోవడంపై గవాస్కర్ రోహిత్ ను తప్పుబట్టాడు. బూమ్రా సారధ్య బాధ్యతలు తీసుకోవడాన్ని సమర్ధిస్తూ.. గవాస్కర్ రోహిత్ ను విమర్శించాడు. దీనిపై జాతీయ మీడియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “సునీల్ గవాస్కర్ తనను విమర్శించాల్సిన అవసరం లేదని రోహిత్ భావించాడు, అందుకే అతను గవాస్కర్‌పై బిసిసిఐకి ఫిర్యాదు చేసాడు” అంటూ జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : రాజమౌళి – మహేష్ సినిమా లీక్.. భారీ ఫైన్..!

రోహిత్ పై ఈ కామెంట్స్ ఒత్తిడిని పెంచాయాని.. అందుకే అతను బోర్డుకు కంప్లైంట్ చేసినట్టు ఒక క్రికెట్ వెబ్ సైట్ పేర్కొంది. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ సీరీస్ లో హిట్‌ మ్యాన్ కేవలం 31 పరుగులే చేసాడు. ఇక తన ఫాంను తిరిగి అందుకోవడానికి రోహిత్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇందుకోసం రంజీ మ్యాచ్ లు కూడా ఆడుతున్నాడు. అయితే జమ్మూ & కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబయి తరుపున బరిలోకి దిగిన రోహిత్.. ఆకట్టుకోలేదు. కాగా రాబోయే ఇంగ్లాండ్ సీరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు భారత జట్టుకు అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్