Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

పేర్నికి మూడింది.. అడ్డంగా దొరికాడా..?

పదే పదే మీడియా ముందుకు వచ్చి చెలరేగిపోయే వైసిపి నేత మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్నే నానికి ముహూర్తం ఫిక్స్ చేసారు అధికారులు. జగన్ కు మద్దతుగా మాట్లాడే క్రమంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పేర్ని నానీ గత అయిదేళ్ళ నుంచి చేసిన పాపాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా పేర్ని నానీపై క్రిమినల్ కేసు నమోదుకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు ఇచ్చింది. మచిలీపట్నం నానికి చెందిన సివిల్ సప్లై గౌడాన్ లో 90 లక్షల విలువైన రేషన్ బియ్యం గల్లంతయినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: ఏపీ డీజీపీ ఎవరు..? ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్..?

ఈ నేపథ్యంలో నానిపై క్రిమినల్ కేసులతో పాటు.. రెట్టింపు జరిమానాగా కోటి 80 లక్షలు జరిమానా విధించాలని సివిల్ సప్లై శాఖ సీఎం డి ఆదేశాలు ఇచ్చారు. మచిలీపట్నంలో నానికి చెందిన 4వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగిన గౌడాన్ ను 2020లో లీజుకు తీసుకున్నారు. తన గౌడాన్ లో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కి నానీ లేఖ రాసారు. దాదాపుగా 3200 బస్తాల్లో తరుగు ఉన్నాయని.. తరుగు వచ్చిన సొమ్మును తాను చెల్లిస్తానని లేఖలో నానీ పేర్కొన్నాడు.

Also Read: నాపై కక్ష అందుకే… మనోజ్ సంచలనం

నాని లేఖ రాయడంతో గత నెల చివర్లో, ఈ నెల మొదటి వారంలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 టన్నుల బియ్యం తగ్గినట్లు గుర్తించారు. వీటి విలువ 89 లక్షల 72 వేలు అని అధికారులు పేర్కొన్నారు. మరోసారి పూర్తిస్థాయిలో గౌడాన్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని… అప్పుడు కూడా ఇలాగే వస్తే జరిమానా తో పాటు గోడౌను బ్లాక్ లిస్టు లో పెట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్