గత కొన్నాళ్లుగా మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదలవుతున్న బూడిద విషయంలో, అలాగే నియోజకవర్గం నుంచి వెళ్లే కృష్ణా నదిలో ఇసుక తరలింపు విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది నుంచి పెద్ద ఎత్తున తవ్వుతూ, అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. దీనికి పోలీసులు కూడా సహకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read : ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?
ప్రజా ప్రతినిధి సహకారంతో కొంతమంది వైసీపీ నేతలు కూడా నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఇసుక డాన్ దందాకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం లోని ఫెర్రీలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని, కంచెల, కాసరాబాద్ రీచ్ లలో ఇసుక డాన్ చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైలవరంలో బూడిద కోసం అక్రమంగా యార్డులను కూడా ఏర్పాటు చేసి, తరలించడంపై విమర్శలు ఉన్నాయి.
Also Read : శ్రీచరణికి ఘన స్వాగతం.. ఇంటి బయటకు వచ్చిన లోకేష్ స్వాగతం..!
ఇక వైసిపి ఇసుక డాన్ తో టిడిపి ప్రజాప్రతినిధులు అంట కాగుతున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధి బావమరిది విషయంలో కూడా విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న దందాలను ఆయనే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణ సైతం ఉంది. బూడిద విషయంలో గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నా సరే, ఎమ్మెల్యే వైఖరిలో మార్పు రావడంలేదని మండిపడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో కాలేజీల విద్యార్థులు కూడా దీని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న సరే, బూడిద అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ రవాణా విషయంలో టిడిపి అనుకూల మీడియా కూడా ప్రజాప్రతినిధిపై విమర్శలు చేస్తోంది. వైసీపీ నేతలకు సహకరిస్తూ ఇసుకతో పాటుగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారని, అనుమతి లేకుండా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

