ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అంతే సీరియస్ గా టీడీపీ కార్యకర్తలు కూడా ఈ కేసు విషయంలో అరెస్ట్ ల కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్ళ పాటు లిక్కర్ స్కాంలో పెద్ద ఎత్తున దోపిడి జరగడమే కాకుండా, నకిలీ మద్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతీ వ్యాపార వ్యవహారాలను చూసే, బాలాజీ గోవిందప్పల, ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం అయింది.
Also Read : రాఖీ పండుగ ప్రత్యేకత.. పాటించాల్సిన నియమాలు ఇవే..!
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా వీరే. దీనితో ఈ కేసులో వైఎస్ జగన్ ను కూడా అరెస్ట్ చేయడం ఖాయం అని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసును నీరు గార్చేందుకు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారనే ఓ ఆరోపణ సంచలనం అయింది. ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇప్పించడం కోసం అడ్వకేట్ జనరల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై ఒత్తిడి చేశారని మండిపడ్డారు.
Also Read : ఖబడ్డార్ కేటీఆర్.. తడాఖా చూపిస్తాం.. కమ్మ సంఘాల హెచ్చరిక
ఈ కుంభకోణంలో 30 వేల మంది మరణించారని, వేల కోట్లు దోచుకున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ విషయమై గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, అడ్వకేట్ జనరల్ ఫోన్‌ను సీజ్ చేసి, కాల్ రికార్డ్స్‌ను భద్రపరచాలని పోలీసులను కోరారు. ఇది అధికార దుర్వినియోగం అని, అడ్వకేట్ జనరల్ లంచాలకు ఆశపడ్డారని సంచలన కామెంట్స్ చేసారు. దమ్మలపాటి రక్తపు కూటికి ఆశపడి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు.




