Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

చిన్నారి ఏడుస్తుందని డ్రైన్ క్లీనర్ పోసిన మహిళ

సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే వారిని బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే భయపెట్టి ఏడుపు ఆపడానికి ఏదోక రకంగా ప్రయత్నిస్తారు. కాని ఓ మహిళ మాత్రం చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన యూరప్ లో చోటు చేసుకుంది. ఫ్రెంచ్ కోర్టు గురువారం ఒక పసికందు ప్రాణం తీసినందుకు ఒక డేకేర్ ఉద్యోగికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిశువు ఏడుపు ఆపడానికి డ్రెయిన్ క్లీనర్ తాగించడం ఆందోళన కలిగించింది. 30 ఏళ్ల మిరియమ్ జౌయెన్‌ ఈ ఘటనకు పాల్పడింది.

Also Read : భారత్ ను భయపెడుతున్న ట్రంప్ డర్టీ 15

ఫ్రాన్స్ ఆగ్నేయ నగరమైన లియాన్‌ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. 2022లో జరిగిన బేబీ లిసా కేసులో తాను ఏం చేస్తున్నానో తెలిసి కూడా ఆమె ఈ ఘటనకు పాల్పడింది అని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నుంచి సమాజాన్ని రక్షించడానికి తాము ఈ తీర్పు ఇస్తున్నామని కోర్ట్ వెల్లడించింది. పోలీసు కస్టడీలో నిందితురాలు తాను లీసాకు విషపూరిత ద్రవాన్ని ఇచ్చానని అంగీకరించింది. కాని ప్రాణం తీయాలనే ఉద్దేశం ఆమెకు లేదని కోర్ట్ అభిప్రాయపడింది.

Also Read : రబాడాపై బీసీసీఐ పగ సాదిస్తోందా..?

తాను ఆ బిడ్డ తల పట్టుకుని, ఆ ద్రవాన్ని నోట్లో పోసాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ శిశువు ఏడుపు తాను ఇక భరించలేక ఆ నిర్ణయం తీసుకున్నా అంటూ వివరణ ఇచ్చింది. ఇక ఆమెలో ఏ విధమైన పశ్చాతాపం లేకుండా ఉండటాన్ని చూసి కోర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ఈ ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం.. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్