అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టడానికి చాలా మంది ఆటగాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కొందరు సక్సెస్ అయితే మరికొందరు కెరీర్ లో రాణించలేక వేనుతిరుగుతూ ఉంటారు. కొందరికి జట్టులో ఎంపిక అయినా సరే తుది జట్టులో ఆడటం కష్టంగా ఉంటుంది. అందులో యువ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. 2022 లో జాతీయ టెస్ట్ జట్టుకు ఎంపిక అయ్యాడు ఈశ్వరన్. కాని ఇప్పటి వరకు.. అతనికి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను జట్టులోకి వచ్చిన తర్వాత 15 మంది ఎంపిక అయ్యారు.
Also Read : ట్రంప్ సంచలన ప్రకటన.. పాకిస్తాన్ తో కీలక ఒప్పందం
సాయి సుదర్శన్, జైస్వాల్, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ దీప్ సింగ్, ముకేష్ కుమార్ ఇలా 15 మంది ఆటగాళ్ళు తుది జట్టులో ఆడారు. కాని ఈశ్వరన్ ను మాత్రం గుర్తించలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ 103 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.70 సగటుతో 7841 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సీరీస్ లకు ఎంపిక అయ్యాడు. కాని అవకాశం మాత్రం కల్పించలేదు. దీనితో సోషల్ మీడియా జనాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read : అమెరికాపై రివెంజ్ ఉండదు.. కేంద్రం ప్రకటన..?
జైస్వాల్ ఆడకపోయినా అవకాశాలు ఇచ్చే యాజమాన్యం, ఈశ్వరన్ ను ఎందుకు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరీస్ లో కీలక సమయాల్లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. ఇక కరుణ్ నాయర్ ఫెయిల్ అయినా సరే తుది జట్టులో చోటు కల్పించారు. ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి వస్తున్నారని, తన కొడుకు సుదీర్ఘ రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు అని.. అయినా సరే అవకాశాలు ఇవ్వడం లేదని, దీనితో ఈశ్వరన్ డిప్రెషన్ లో ఉన్నట్టు కనపడుతున్నాడని అతని తండ్రి రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేసారు.