Thursday, March 12, 2026 09:00 PM
Thursday, March 12, 2026 09:00 PM

వాట్సాప్ పేరెంట్ కంట్రోల్ అంటే ఏంటీ..?

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది అత్యంత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా చిన్న పిల్లలు దీన్ని వాడుతున్న విధానం భయపెడుతోంది. అందుకే సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు కూడా జాగ్రత్త పడుతూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా వాట్సాప్ పేరెంటల్ కంట్రోల్ ను తీసుకొచ్చింది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్, 13 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేకమైన పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా వాట్సాప్ వాడటానికి కనీస వయస్సు 13 ఏళ్లు ఉండాలి.

Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు

అయితే, ఇప్పుడు 13 ఏళ్ల లోపు పిల్లలు వాట్సాప్ వాడాల్సి వస్తే, వారి ఎకౌంటు ను పేరెంట్స్ ఎకౌంటు కు లింక్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ ఉంటుంది. ఎకౌంటు లింక్ చేయడం ద్వారా.. పిల్లల యాక్టివిటీని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరిని తమ కాంటాక్ట్ లిస్ట్‌ లో చేర్చుకోవాలో, ఎవరితో చాట్ చేయాలో తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్‌ లను బ్లాక్ చేసే అధికారం తల్లి తండ్రుల చేతుల్లో ఉంటుంది.

Also Read : ఏపీ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్

పిల్లలు రోజులో ఎంతసేపు వాట్సాప్ వాడాలో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించవచ్చు. ఆ సమయం ముగియగానే యాప్ ఆటోమేటిక్‌ గా లాక్ అవుతుంది. పిల్లల ప్రొఫైల్ ఫోటో, ‘లాస్ట్ సీన్’, స్టేటస్‌ లను ఎవరు చూడవచ్చో తల్లిదండ్రులు సెట్ చేయవచ్చు. దీనివల్ల సైబర్ నేరగాళ్ల నుండి పిల్లలకు రక్షణ లభిస్తుంది. అశ్లీలమైన లేదా అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు రాకుండా ఉండేలా సెట్టింగ్స్ మార్చుకునే వెసులుబాటు ఉంది. వాట్సాప్ ను అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐఎస్ అంటే ఏంటీ..?...

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య...

ముహుర్తం ఖరారు.. మార్చి...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి....

ఏపీ మంత్రుల ప్రోగ్రెస్...

ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పని తీరును...

బ్రేకింగ్: భారత నౌకలకు...

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య...

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

పోల్స్