Tuesday, October 28, 2025 07:11 AM
Tuesday, October 28, 2025 07:11 AM
roots

సినిమాలు ఆగుతాయా..? ఆ సినిమాల రిలీజ్ ఎప్పుడు..?

భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణ ప్రభావం తెలుగు సినిమాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితులు ఇప్పట్లో ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం లేకపోవడంతో తెలుగు సినిమా షూటింగులు కొన్నాళ్లపాటు నార్త్ ఇండియాలో కొనసాగే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో మన తెలుగు సినిమాలు ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటాయి. రాజస్థాన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రముఖ సినిమాలను షూటింగ్ చేస్తూ ఉంటారు.

Also Read : షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

ఇప్పుడు వాటిపై యుద్ధ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం జరిగినా సరే.. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉన్నది. దీనితో కొన్ని కీలక సినిమాలు ఉత్తర భారత దేశంలో షూటింగ్ జరుపుకునే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. సాధారణంగా వేసవిలో జమ్మూ కాశ్మీర్ లో సినిమా షూటింగ్ లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

Also Read : బీఆర్ఎస్ కు సైలెంట్ స్ట్రోక్ ఇవ్వబోతున్న హరీష్..?

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులు నిర్మాతలు రిస్కు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. టూరిస్ట్ ప్రదేశాల్లో షూటింగ్ లు చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో షూటింగ్ లు అన్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిలీజ్ లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సినిమాల విడుదలను కూడా కొన్నాళ్లపాటు కొంతమంది హీరోలు వాయిదా వేసే అవకాశాలు సైతం కనబడుతున్నాయి.

Also Read : యుద్ధం సమాప్తం.. రెండు దేశాల కీలక ప్రకటన

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు సినిమాలను మే నెలలో విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ హడావుడి ఎక్కడా కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. విడుదల తేదీని కూడా ప్రకటించారు. కనీసం దీనికి సంబంధించి ఆ తర్వాత ఏ అప్డేట్ లేకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశాలే కనబడుతున్నాయి. అటు మహేష్ బాబు, రాజమౌళి సినిమా కూడా వాయిదా పడే సంకేతాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్