వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో వైఎస్ జగన్ ఇప్పుడు పూర్తిగా ఒత్తిడిలో ఉన్నారు. ఎలాగైనా సరే ఢిల్లీలో పట్టున్న నాయకుడిని.. తమ పార్టీలోకి తీసుకోవాలని ఆయన నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ ఎంపీల వైపు కూడా జగన్ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైపు వైయస్ జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
Also Read : ఆరిన మెగా మంటలు.. ఆర్పేసిన బావ, బావమరిది…!
రెండు రోజుల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సమయం దొరికిన ప్రతిసారి జగన్ పై ప్రశంసలు కురిపించే ఉండవల్లి అరుణ్ కుమార్ కు.. ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో మనుగడ సాగించాలి అంటే.. జగన్ కు ఢిల్లీలో కచ్చితంగా ఏదో ఒక పార్టీతో సంబంధాలు ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు జగన్.. ఉండవల్లి అరుణ్ కుమార్ ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read : టీడీపీని ముంచుతున్న “కుటుంబాల చేరికలు”
ఇక దానితో పాటుగా మాజీ ఎంపీ హర్ష కుమార్ వైపు కూడా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హర్షకుమార్ కు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయనను కూడా పార్టీలోకి తీసుకునేందుకు జగన్ రాజకీయం మొదలుపెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా ఉన్న కొంతమంది కీలక నేతలు కోసం జగన్ ఆసక్తి చూపించడం.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత పరిణామాలు జగన్ కు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు.




