Monday, October 20, 2025 05:26 AM
Monday, October 20, 2025 05:26 AM
roots

వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళల విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఏపీ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం ప్రవేశ పెడతామని హోం మంత్రి అనిత ప్రకటించారు. వాస్తవాలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను అభత్రావాభానికి గురి చేస్తున్నారు అని మండిపడ్డారు.

Also Read : వివేకా కేసులో సుప్రీం సంచలన నిర్ణయం..!

ఏపీ బ్రాండ్ ను దెబ్బతీసే రీతిలో సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ పధకాలను సూపర్ హిట్ చేస్తే తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లు పనిచేయడం లేదని పలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు.

Also Read : వైసీపీకి టీడీపీ బంపర్ ఆఫర్..!

అలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. అమరావతిపై లేనిపోని రాతలు రాసేవారిపై కేసులు పెడతామని స్పష్టం చేసారు. ఆనాడు రఘురామ కృష్ణ రాజుపై కాదు ఈనాడు మీరు పెడుతున్న తప్పుడు పోస్టులపై రాజద్రోహం కేసులు పెట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సియం స్పష్టం చేశారని అనిత వెల్లడించారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతామని శాంతిభద్రతల విషయంలో రాజీలేదని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్