గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ ఉన్నాడు. ఇప్పటికే వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు నమోదు అయింది. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్.. సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో కేసు నమోదు చేసారు. అయితే కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేసాడు.
Also Read: తులసిబాబు విషయంలో రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ బందువులు ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. 140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) కేసులు నమోదు చేసారు. వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం గమనార్హం. వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. వెంటనే అరెస్ట్ చేసారు. వంశీని విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మైహోం భూజాలో వంశీని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
Also Read: బాబు సీనియర్… ఇక నీ సేవలు చాలు..!
ఇక సత్యవర్ధాన్ ను వంశీ అనుచరులు కొట్టినట్టు సమాచారం. అతను కేసు వెనక్కు తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక వంశీ అనుచరులను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు బలంగా ఉండటంతో ఎలాగైనా బయట పడాలని వంశీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు వంశీ. అయితే కొత్త కేసులో పక్కా ఆధారాలతో ఈ విధంగా పోలీసులు వంశీని అరెస్ట్ చేయడం గమనార్హం.




