భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటుగా ఆ దేశ అధికారులు కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఆ దేశ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఆర్ధిక సహాయం చేస్తూ.. రష్యన్ చమురును కొనుగోలు చేయడంతో పాటు, అమెరికా వస్తువులపై భారీ సుంకాలు విధించి.. భారత్ అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మోసం చేస్తుందని ఓ సీనియర్ అధికారి కామెంట్ చేసారు. రష్యాతో వాణిజ్య ఒప్పందాలను నిలిపివేయాలంటూ భారత్ పై అమెరికా ఒత్తిడి చేస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read : ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అంటే నిధులు సమకూర్చడమే అని.. ఇది ట్రంప్ స్పష్టంగా చెప్పారని.. రష్యాతో భారత్ – చైనా కలిసి ఒప్పందాలు చేసుకున్నాయని.. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్టీఫెన్ మిల్లర్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసారు. భారత్ తో ట్రంప్ అద్భుతమైన సంబంధాలను కోరుకుంటున్నారని, ఆ దేశ ప్రధానితో కూడా ట్రంప్ కు మంచి సంబంధాలు ఉన్నాయని, భారత్ ఇలా చేయడం తగదు అంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
Also Read : రాహుల్ గాలి తీసుకున్నారా..? బిజెపికి మరో అస్త్రం..!
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసాయి. ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధించిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు చేసారు సదరు అధికారి. ఆయిల్ కొనుగోలు చేస్తే భారత్ మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవడం ఖాయమని ట్రంప్ సర్కార్ బెదిరిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై యుద్ధం ముగించే దిశగా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. దీనితో రష్యాతో సన్నిహితంగా ఉండే భారత్.. ఈ ప్రక్రియలో కీలకంగా మారింది.




