Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

జగన్ ముందు ఎక్కిళ్ళు.. బాబు ముందు కక్కుళ్ళు…!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఓవరాక్షన్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. వైసిపి హయాంలో నోరు ఎత్తని వాళ్ళు అందరూ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలో తమకు నచ్చినట్టుగా వ్యవహరించడం… ఏకంగా ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయకుండా ప్రవర్తించడం వంటివి సెన్సేషన్ అవుతున్నాయి. తాజాగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట విషయంలో ఈవో వ్యవహరించిన వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

Also Read : పిలుపు దూరంలో మంత్రి.. ఏపీ కేబినేట్ లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్..!

టిటిడి చైర్మన్ పై సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే ఈవో చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అదే జగన్ ఉండి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారా… జగన్ ముందు అంత వాయిస్ బయటకు వచ్చి ఉండేదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఏది చెప్తే దానిని ఫైనల్ చేసి ఆ విధంగా పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు చంద్రబాబు విషయంలో మాత్రం తోకజాడించడం చూసి టిడిపి నేతలు కూడా షాక్ అవుతున్నారు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈవో లాంటి అధికారి ఆ విధంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ మంత్రులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : టిటిడి లో ఎవరి పై వేటు పడనుంది..?

ముఖ్యమంత్రిని లెక్క చేయనప్పుడు తమ మాటకు విలువ ఉంటుందా అనే ఆందోళన కూడా మంత్రులలో వ్యక్తం అవుతుంది. మంత్రులకే విలువ లేకపోతే ఎమ్మెల్యేలు పరిస్థితి మరీ దారుణంగా ఉండే ఛాన్స్ ఉంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు కనీసం ట్రాఫిక్ పోలీసులు ఆపిన బండ్లను కూడా విడిపించలేని పరిస్థితిలో ఉన్నారు అనే టాక్ కూడా వినపడుతోంది. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే కొంతమంది అధికారులలో మాత్రం మార్పు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై ఇప్పుడు కూటమి సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే టీటీడీ ఈవో పై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది అనే ఒపీనియన్ కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్