Wednesday, August 5, 2026 07:51 AM
Wednesday, August 5, 2026 07:51 AM

స్పీకర్లకు నిప్పుపెట్టేస్తున్న తమన్.. దండం రా దూత…!

ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అంటే సినిమాల్లో ఉండే డైలాగులకు ఎక్కువగా వెయిట్ ఉండేది. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలంటే సినిమాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపుతోంది. అఖండ సినిమా తర్వాత నుంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరెక్టర్లు కూడా పక్కాగా ఉంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే బాలయ్య సినిమాలకు ప్రాణం పెట్టేస్తున్నాడు. డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో తమన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అయితే కొన్నిచోట్ల థియేటర్లలో స్పీకర్లు కాలిపోవడం సెన్సేషన్ అవుతుంది.

Also Read : తిరుమలలో జగన్ కామెడీ.. మారని జగన్ తీరు

బెంగళూరులో ఒక థియేటర్లో మూడు స్పీకర్లు కాలిపోయాయట. ఈ విషయాన్ని అభిమానులు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటు గోదావరి జిల్లాలో కూడా ఒకటి రెండు చోట్ల స్పీకర్లు కాలిపోవడం సెన్సేషన్ అయింది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సినిమాలకు ఇదే టాక్ వస్తోంది. ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా త్వరలో అందులో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేశారు.

Also Read : సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!

యాక్షన్ సినిమాల్లో బాలయ్యను కొట్టిన వాళ్ళు టాలీవుడ్ లో లేరు. అలాంటి యాక్షన్ హీరోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడితే బొమ్మ సూపర్ హిట్ అనే టాక్ ఇప్పుడు వచ్చేస్తోంది. కథ ఎలా ఉన్నా సరే బాలయ్య సినిమాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నెట్టుకు వచ్చేస్తున్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా తమన్ ఇలాగే వర్క్ చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక బాలయ్యకు స్టోరీ వినిపించిన వెంటనే తమన్ కు కూడా డైరెక్టర్ లు నేరేషన్ ఇచ్చేస్తున్నారు. సినిమా అఫీషియల్ గా ఫైనల్ అయిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆటోమేటిక్ ఫైనల్ అయిపోతున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్