Friday, March 6, 2026 03:54 AM
Friday, March 6, 2026 03:54 AM

ఈరోజు రాశి ఫలితాలు (05-03-2026)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం 05-03-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృషభం

బాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

—————————————

మిధునం

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతోకూడినవిగా ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

సింహం

ఆత్మీయులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

కన్య

పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

—————————————

తుల

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది.

—————————————

వృశ్చికం

దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

—————————————

ధనస్సు

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది.

—————————————

మకరం

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

కుంభం

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

—————————————

మీనం

గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెళ్లిపై చంద్రబాబు కీలక...

దేశ వ్యాప్తంగా జనాభా తగ్గిపోవడంపై ఆందోళన...

బొత్సను పూర్తిగా పక్కన...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

సీఎంఓలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఓర్పు,...

ఆ విషయంలో పూర్తిగా...

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించన...

నాడు వద్దన్న అదానీ...

ఏపీలో అదాని గ్రూప్ నుంచి సౌర...

నానీ యాక్టివ్ అవ్వడానికి...

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ...

పోల్స్