Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

భారత టెస్ట్ క్రికెట్ లో ఓ శకానికి ముగింపు పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఊహించని విధంగా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరూ తప్పుకోవడంతో కొత్త ఆటగాళ్ళు ఎవరు జట్టులోకి వస్తారనే దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే పనిలో ఉంది. కెప్టెన్ ఎంపిక విషయంలో బోర్డు పెద్దల నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

మూడు స్థానాలను సమర్ధవంతమైన ఆటగాళ్ళతో భర్తీ చేయాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ స్థానంలో సమర్ధవంతమైన ఓపెనర్ తో పాటుగా మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కావాల్సి ఉంది. ఇక స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ తప్పుకోవడంతో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇంగ్లాండ్ పర్యటనకు స్పిన్నర్ తో పెద్దగా అవసరం ఉండదు. జడేజా రిటైర్ కాకపోతే అతడితో జట్టును ముందుకు నడిపే అవకాశం ఉంటుంది. ఇక కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read : కాల్పుల విరమణ పై దేశ ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పేదెవరు?

ఇంగ్లాండ్ పర్యటనకు పేస్ ఆల్ రౌండర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శార్డుల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. రంజీ సీజన్ లో అతను మెరుగ్గా రాణించాడు. వీరితో పాటుగా బాబా ఇంద్రజీత్, తనుశ్ కోటియన్ వంటి ఆటగాళ్ళు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వైట్ బాల్ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా రెడ్ బాల్ క్రికెట్ లో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. ముఖేష్ కుమార్, యష్ దయాళ్ వంటి ఆటగాళ్ళు కూడా బౌలింగ్ విభాగంలో చోటు కోసం కష్టపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్