Friday, September 12, 2025 05:28 PM
Friday, September 12, 2025 05:28 PM
roots

తెలంగాణాలో టీడీపీ గేమ్ స్టార్ట్

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యాచరణకు రంగం సిద్ధమైనట్లుగానే కనబడుతోంది. తెలుగుదేశం పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించే విషయంలో పార్టీ అధిష్టానం దూకుడు పెంచినట్లుగానే సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ తేగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మరో ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం కనబడుతోంది.

Also Read : కొడుకు కోసం మెట్టు దిగుతున్న కాపు నేత…!

ఇక తీగల కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకూడదని వచ్చే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలోకి వచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడుని అమరావతిలో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాదులో అపాయింట్మెంట్ కోరినా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ కారణంగా ఇవ్వలేకపోయారు. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన కీలక బీఆర్ఎస్ నేత ఒకరు ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే ఆయన కూడా చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం కనబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక అడుగులు వేయడానికి బిజెపితో కలిసి కార్యాచరణను తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టనుంది.

Also Read : ఇల్లు కంటే జైలు బెటర్.. ఏపీలో ఇదే హాట్ టాపిక్

తనకు పట్టణ ప్రాంతాల్లో అలాగే కార్యకర్తల బలం ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి అలాగే గ్రామ కమిటీలను జిల్లా కమిటీలను కూడా పూర్తిచేసి అవసరమైతే వారంలో రెండు రోజులు హైదరాబాదులో ఉండి తెలంగాణలో పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పాలన గాడిలో పడిన తర్వాత సంక్రాంతి తర్వాతి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యేదిశగా అడుగులు వేయనున్నారు. అటు బిజెపి అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు బలం ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దూకుడుగా రాజకీయం చేయనుంది అలాగే కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి నేతలకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాలం వేయడం గమనార్హం

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్