Friday, March 27, 2026 09:10 AM
Friday, March 27, 2026 09:10 AM

ఏ టైం అయినా.. డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటి..!

ఏ రంగంలో అయినా డెడికేషన్ అనేది అత్యంత కీలక అంశం. డెడికేషన్ లేనిదే తాము ఎంచుకున్న రంగాల్లో రాణించడం చాలా కష్టం. ఈ విషయంలో టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉంటాడు. జట్టు నుంచి పిలుపు వస్తే చాలు ప్రతీ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు ఈ హైదరాబాది ఆటగాడు. టి20 వరల్డ్ కప్ కు సంబంధించి జట్టును ప్రకటించిన సమయంలో సిరాజ్ పేరు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు యాజామాన్యం ఆలోచనలో కూడా సిరాజ్ కనపడలేదు.

Also Read : పసి కూనలు కాదు.. డైనమైట్స్..!

కేవలం హర్షిత్ రానా పేరు మాత్రమే వినపడింది. కానీ.. హర్షిత్ రానా గాయపడటంతో జట్టులోకి వచ్చిన సిరాజ్.. వచ్చిన వెంటనే భారత్ కు తన సత్తా ఏంటో చూపించాడు. మ్యాచ్ కు ఒక రోజు ముందు.. జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే ముంబై వెళ్లి జట్టుతో కలిసాడు. ఆ తర్వాతి రోజు కాసేపు ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడాడు సిరాజ్. కీలక సమయంలో అతను తీసిన 3 వికెట్లు భారత్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. అతని డెడికేషన్ గురించే ఇప్పుడు చర్చ మొత్తం.

Also Read : అంబటి మరో పోసాని అవుతారా..?

ఇగో ఫీలింగ్స్ లేకుండా, ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ, నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ, తన టాలెంట్ కు పదును పెడుతూ దూసుకుపోతున్నాడు సిరాజ్. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత సిరాజ్ కు అన్యాయమే జరిగింది. వన్డేలు ఆడకుండా కేవలం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే అతనిని పరిమితం చేసాడు. వన్డేలు కూడా ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడిస్తున్నారు. టి20 లకు పూర్తిగా పక్కన పెట్టేసారు. కానీ వచ్చిన అవకాశాలు మాత్రం రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అందుకే డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీట్ల పెంపు.. ఎవరికి...

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న...

అమరావతి చట్టబద్దత.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ...

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్...

కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో అభివృద్ధికి...

అమరావతి అగ్నిప్రమాదాలపై ఏపీ...

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని...

ఆ రెండు జిల్లాలే...

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

బ్రేకింగ్: జగన్ కు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

పోల్స్