ప్రిథ్వీ షా… తల్లి చిన్న తనంలోనే మరణించినా… తండ్రి కష్టంతో జాతీయ జట్టుకు ఎంపికైన అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి టెస్ట్ లోనే సెంచరీ చేసి… క్రికెట్ ఫ్యాన్స్ మతి పోగొట్టాడు. ప్రతిష్టాత్మక ఎంఆర్ఎఫ్ బ్యాట్ పై సంతకం చేసే అవకాశం సచిన్, విరాట్ కోహ్లీ, తర్వాత ప్రిథ్వి షాకే దక్కింది. అలాంటి ఆటగాడి కెరీర్ ఇప్పుడు సర్వ నాశనం అవుతోంది. అతని కెరీర్ ను ఎవరో నాశనం చేయడం లేదు… అతనే స్వయంగా నాశనం చేసుకుంటూ బంగారం లాంటి భవిష్యత్తుకు గోతులు తవ్వుకుంటున్నాడు.
Also Read: లిక్కర్ అక్రమార్కుల బెండు తీస్తున్న ఏపీ సిఐడి
దేశవాళి జట్లలో ముంబైకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ఉన్నత స్థాయి క్రికెటర్లను అందించిన జట్టు అది. గవాస్కర్, సచిన్, కాంబ్లి, రహానే సహా ఎందరో ముంబై జట్టులో ప్రతిభ చూపించే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి జట్టులో ఉండి కూడా ప్రిథ్వి షా కెరీర్ ను నాశనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత జట్టులో ఇప్పుడు ప్రభావం చూపిస్తున్న గిల్, జైస్వాల్, సర్ఫరాజ్ కంటే ముందే అతను జట్టులోకి వచ్చాడు. జట్టులోకి వచ్చిన తర్వాత చోటు నిలబెట్టుకోవడం కష్టమే… సరే కోల్పోయిన తర్వాత ప్రయత్నం చేయాలి…

కానీ పృథ్వీ షా భారీగా బరువు పెరిగాడు. ముంబై జట్టు యాజమాన్యం… మహారాష్ట్ర క్రికెట్ బోర్డ్ కి ఇచ్చిన నివేదికలో అతని శరీరంలో కొవ్వు 35 శాతం ఉందని పేర్కొన్నారు. అందుకే జట్టు నుంచి తప్పిస్తున్నాం అంటూ ముంబై ప్రకటన చేస్తూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని సూచించింది. దానికి వెటకారంగా సోషల్ మీడియాలో నీడ్ ఏ బ్రేక్, థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టాడు ఈ యువ క్రికెటర్. అలాగే సీనియర్ ఆటగాళ్ళు రహానే, శ్రేయాస్ అయ్యర్ సహా చాలా మంది ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్ కు హాజరు అవుతుంటే 24 ఏళ్ళ ప్రిథ్వి షా మాత్రం హాజరు కావడం లేదు. దీనితో అతని కెరీర్ ముగిసినట్టే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ముంబై జట్టులో చోటు కోల్పోతే ఇతర జట్లు తీసుకోవడం కూడా కష్టమే.