Tuesday, February 17, 2026 06:16 PM
Tuesday, February 17, 2026 06:16 PM

టి20 వరల్డ్ కప్ లో భారత్ టెన్షన్ అవుట్..?

టి20 వరల్డ్ కప్ లో సంచలనాలు వరుసగా నమోదు అవుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని జట్లు సాధిస్తున్న విజయాలు.. పెద్ద జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సంచలనం నమోదు అయింది. ఆస్ట్రేలియా జట్టును ఏ మాత్రం అంచనాలు లేని శ్రీలంక జట్టు ఓడించింది. అది కూడా చాలా సునాయాసంగా.. ఓడించడం ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా కనీసం నిలబడటానికి కష్టపడుతున్న పిచ్ పై.. 180 పై చిలుకు లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించింది.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్..?

అయితే ఇప్పుడు ఈ విజయమే భారత అభిమానులను సంతోష పెడుతోంది. టి20 వరల్డ్ కప్ లో భారత్ కు పెద్ద తలనొప్పి ఆస్ట్రేలియానే. ఇప్పుడు ఆ జట్టు దాదాపుగా బయటకు వెళ్ళినట్లే. జింబాబ్వే గనుక ఐర్లాండ్ పై విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా బయటకు వెళ్ళినట్లే. మూడు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ఒకటి మాత్రమే గెలిచింది. జింబాబ్వే రెండు మ్యాచ్ లు గెలిచింది. దీనితో ఆస్ట్రేలియా దాదాపుగా వెళ్ళిపోయే సంకేతాలే కనపడుతున్నాయి. ఆస్త్రేలియానే ఓడించినప్పుడు.. జింబాబ్వేకి ఐర్లాండ్ పెద్ద లెక్క కాదు.

Also Read : భారత్ – పాక్ మ్యాచ్ ఆదాయం ఎన్ని వేల కోట్లు అంటే..?

దీనితో భారత ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భారత్ ఇప్పటికే సూపర్ 8 కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మరో మ్యాచ్ గెలిస్తేనే క్వాలిఫై అవుతుంది. ఇక పెద్ద జట్లలో ఆస్ట్రేలియా మినహా అన్ని జట్లు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ దశలో కంగారు పెట్టిన చిన్న జట్లు.. సూపర్ 8 దశలో కూడా కంగారు పెట్టె అవకాశం ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా 2023 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఏ టోర్నీలో కూడా ఫైనల్ వరకు చేరుకోకపోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ క్యాబినెట్‌లో కొత్త...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఆ విషయంలో టీడీపీ...

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల...

ఆ సీటు ఎవరికి...

వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు విషయంలో...

బెజవాడ మేయర్ గా...

రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో...

జగన్ ఢిల్లీ ప్రయత్నాలు...

2019 లో వైఎస్ జగన్ సిఎం...

పోల్స్