భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్… ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. 9 నెలల నిరీక్షణ తర్వాత ఆమెను సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురు వ్య్యోమగాములు కూడా భూమి పైకి చేరుకున్నారు. ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో… ఆమె సేఫ్ ల్యాండింగ్ అయ్యారు. కొన్నాళ్లపాటు నాసా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోనున్న సునీత విలియమ్స్… సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడానికి శారీరక వ్యాయామంతో పాటుగా మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరం.
Also Read : హైదరాబాద్ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం…!
దీనితో కుటుంబ సభ్యులకు కూడా ఆమెను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆమె భారత్ పర్యటనకు రానున్నట్లు… ఆమె కుటుంబ సభ్యురాలు ఒకరు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ఆమె… డ్రాగన్ క్రూ క్యాప్సిల్స్ లో ఆమె సముద్ర జలాల్లో… పారాషూట్ ల సహాయంతో దిగడం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించిందని పేర్కొన్నారు.
Also Read : రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రైళ్లు సికింద్రాబాద్ కు రావు..!
సునీత పూర్తిగా కోలుకున్న తర్వాత… భారత్ కు వస్తారని… తేదీలు ఇంకా ఖరారు కాలేదని అన్నారు. కానీ ఆమె ఖచ్చితంగా భారత్ లో పర్యటిస్తారని… ఈ ఏడాది ఆమె భారత్ రానున్నారని వెల్లడించారు. తాము అందరం కలిసి సెలవులపై… ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని… కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపే సమయం ఇదని వెల్లడించారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సునీత విలియమ్స్ ను భారత్ పర్యటనకు ఆహ్వానిస్తూ లేఖ కూడా రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన సునీత విలియమ్స్… భారత్ వచ్చేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.