Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలంటే భయపడుతున్న స్టూడెంట్స్

సాధారణంగా మన దేశం నుండి అమెరికా లేదంటే ఇతర ఏ విదేశాలకు వెళ్ళినా సరే చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించవచ్చు అని ధీమాతో వెళుతూ ఉంటారు. లోన్లు అలాగే అప్పులు చేసి పార్ట్ టైం ఉద్యోగాలపై ఎన్నో ఆశలతో అమెరికాలో లేదంటే ఇతర దేశాల్లో అడుగుపెడుతుంటారు. కానీ గత కొన్నాళ్లుగా పార్ట్ టైం ఉద్యోగాలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీగా ఫీజులు ఉండటంతో వాటిని చెల్లించేందుకు పార్ట్ టైం ఉద్యోగాలను విద్యార్థులు నమ్ముకుంటున్నారు.

Also Read : MORE THAN A MINISTER.. పర్చూరు అభివృద్ధిపై ఏలూరి మార్క్

ఫీజులు కట్టేందుకు అలాగే ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులకు డబ్బులు పంపించేందుకు పార్ట్ టైం ఉద్యోగాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇప్పుడు కొన్ని దేశాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఈ పరిస్థితి అత్యంత భయంకరంగా మారిందని లెక్కలు చెబుతున్నాయి. దీనితో పార్ట్ టైం ఉద్యోగాలను భారత విద్యార్థులు వదిలేస్తున్నారని అంతర్జాతీయ మీడియా బయటపెడుతోంది. క్లాసులు లేనప్పుడు అనధికారికంగా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఖర్చులు భరించాలంటే ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి.

Also Read : మంత్రి కొండపల్లి బ్లడ్ డొనేషన్ రికార్డ్.. దుమ్మురేపిన క్యాడర్…!

ధరలు పెరిగిపోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున పార్ట్ టైం ఉద్యోగాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనితో తనిఖీల భయంతో పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కొన్ని అమెరికా రాష్ట్రాల్లో… భారత విద్యార్థులపై ట్రంప్ ఎఫెక్ట్ భారీగా పడింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు విద్యార్థులు వలస వెళ్లారు. మరి కొంతమంది తిరిగి భారత్ వచ్చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్