Thursday, March 5, 2026 08:50 PM
Thursday, March 5, 2026 08:50 PM

మోడీ కేబినేట్ లో వింతలు ఇవే..!

రాజకీయాల్లో కొన్ని విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవుతాయి అనడానికి రాజకీయాలు పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు కేంద్రంలో పరిణామాలు ఇలాగే ఉన్నాయి. కొందరు మాజీ ముఖ్యమంత్రులు.. ఇప్పుడు కేబినేట్ లో కేంద్ర మంత్రులు కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగమయ్యారు. 30 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గంలో మూడుసార్లు మధ్యప్రదేశ్ సిఎం గా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

Also Read : బొత్సను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా..!

పలు రాష్ట్రాల మాజీ సిఎంలకు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేబినేట్ మంత్రులుగా ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి.. జితన్ రామ్ మాంఝీ, హెచ్‌డి కుమారస్వామి ఉన్నారు. ఇద్దరూ కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు సిఎంలుగా పని చేసారు. ప్రధాని కావడానికి ముందు, ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేబినేట్ లోని 23 మంది మంత్రులు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేశారు. 39 మంది కేంద్రంలో మాజీ మంత్రులుగా పనిచేశారు.

Also Read : ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

మంత్రి వర్గంలో.. మిత్రపక్షాల నుంచి నుండి 11 మంది మంత్రులు ఉన్నారు. అనుభవానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ.. కేబినేట్ పదవులు ఇచ్చారు. మంత్రివర్గంలో టాప్ లైనప్‌ లో అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్, మరియు ప్రహ్లాద్ జోషి ఉన్నారు. తాజాగా మోడీ కేబినేట్ లోకి నితీష్ కుమార్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెళ్లిపై చంద్రబాబు కీలక...

దేశ వ్యాప్తంగా జనాభా తగ్గిపోవడంపై ఆందోళన...

బొత్సను పూర్తిగా పక్కన...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

సీఎంఓలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఓర్పు,...

ఆ విషయంలో పూర్తిగా...

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించన...

నాడు వద్దన్న అదానీ...

ఏపీలో అదాని గ్రూప్ నుంచి సౌర...

నానీ యాక్టివ్ అవ్వడానికి...

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ...

పోల్స్