Thursday, March 12, 2026 01:34 AM
Thursday, March 12, 2026 01:34 AM

మళ్లీ స్పెషల్ ఆఫీసర్ల పెత్తనం.. ఇలా అయితే..!

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలక వర్గాల గడువు ముగియడంతో, తదుపరి ఎన్నికలు జరిగే వరకు ఆయా సంస్థల పరిపాలనను ప్రత్యేక అధికారులు.. స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 86 నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గరిష్టంగా ఆరు నెలల పాటు లేదా కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని పేర్కొంటూ, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలకు 10 మార్చి 2021న ఎన్నికలు జరిగాయి. మార్చి 10న ఎన్నికలు జరగగా.. మార్చి 14న ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 13 మునిసిపల్ కార్పొరేషన్లను గెలుచుకుంది. 59 మున్సిపల్ కౌన్సిల్స్‌లో 57 వైసీపీ, 2 టీడీపీ గెలిచాయి. నగర పంచాయతీల్లో సైతం 27 వైసీపీ గెలవగా.. ఒకటి మాత్రమే టీడీపీ ఖాతాలో చేరింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నేతలు చేసిన అరాచకం ఇప్పటికే ప్రజలకు గుర్తే. అభ్యర్థులను, ప్రత్యర్థి పార్టీల నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసి, ప్రలోభాలకు గురి చేశారు. మాచర్ల మునిసిపాలిటీలో అయితే నామినేషన్ దాఖలు చేస్తే చంపుతామంటూ బహిరంగంగానే బెదిరించడంతో.. చివరికి నామినేషన్ వేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేనలో చేరడంతో.. చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. మెజారిటీ మునిసిపాలిటీలను టీడీపీ, జనసేన దక్కించుకున్నాయి. ఇప్పుడు వాటి గడువు ముగిసింది. దీంతో ఎన్నికల నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేదనే మాట వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా జనభా లెక్కింపు సహా బీసీ రిజర్వేషన్ అమలు అంశం ఎన్నికలకు బ్రేకులు వేస్తోంది. అయితే స్థానిక ఎన్నికల పైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, ఎన్నికల పైన దాదాపు ఒక స్పష్టత వచ్చినట్లు అయ్యింది. ఈ ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సమావేశంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు అధినేత చంద్రబాబు సూచన చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితాపై కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది.

Also Read : రైతన్నలకు సిఎం చంద్రబాబు గుడ్ న్యూస్..!

అయితే ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటం లేదు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా జన గణన ప్రారంభం అయ్యింది. జన గణన జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 20 తేదీకి ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేసింది. జన గణన పూర్తి చేసి లెక్కలు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జన గణన పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. అంటే 2027 చివర్లో లేదా 2028 ఆరంభంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల పెత్తనం తప్పదా.. అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

పెంచలయ్య సరే.. మరి.....

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు...

రైతన్నలకు సిఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

పోల్స్