సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ ఇప్పుడు నెమ్మదిగా బెంగళూరుకు గుడ్ బై చెబుతున్నాయి. దాదాపు పదేళ్లుగా బెంగళూరులో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయ నగరాలతో పాటు తమకు మేలు చేసే రాష్ట్రాల గురించి ఆలోచిస్తున్నాయి. బెంగళూరు నగరంలో తాజా పరిస్థితులతో పాటు వాతావరణం, జన సాంద్రత, కాలుష్యం వంటి అంశాలను కూడా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
Also Read : లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఆ నలుగురి అరెస్ట్ పక్కా..?
తాజాగా బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. రాజేశ్ అనే సీఈవో 9 ఏళ్లుగా బెంగళూరు ఓఆర్ఆర్ బెల్లందూర్ వద్ద ఆఫీసు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఆఫీసు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఇందుకు ప్రధానంగా అక్కడి రహదారులను ప్రస్తావించారు. రోడ్లన్నీ గుంతలతో మట్టి తేలిపోయిందని.. కాలుష్యంతో పాటు ప్రయాణ భారం కూడా బాగా పెరిగిపోయిందని ప్రస్తావించారు.
రాజేష్ పెట్టిన పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీ కార్యాలయాన్ని విశాఖకు మార్చాలని కోరుతున్నా.. అంటూ విజ్ఞప్తి చేశారు. క్లీన్ సిటీల్లో టాప్ 5లో విశాఖ ఉందని.. మౌలిక వసతులు కల్పిస్తామని.. మహిళలకు ఎంతో సురక్షితమైన నగరమని కూడా లోకేష్ సూచించారు. వీలైతే.. ఓసారి కలవగలరు అంటూ లోకేష్ సూచించారు. లోకేష్ చేసిన పోస్టుతో బెంగళూరుకు చెందిన పలు సంస్థలు కూడా అక్కడి పరిస్థితులను వెల్లడిస్తున్నాయి.
Also Read : నేతలకు జగన్ డెడ్ లైన్..!
రాజేశ్ ప్రస్తుతం బ్లాక్‌బక్ అనే సంస్థకు సీఈవో. ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ట్రక్కింగ్ ప్లాట్‌ఫామ్, ఇది 2015లో స్థాపించారు. ఇది షిప్పర్‌లను ట్రక్కర్లతో అనుసంధానించి లాజిస్టిక్స్, చెల్లింపులు, ఫైనాన్సింగ్ నిర్వహిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ ట్రక్కర్లు, వ్యాపారాలు రెండింటికీ సామర్థ్యం, లాభదాయకతను మెరుగుపరచడం లక్ష్యంగా లోడ్ మార్కెట్‌ప్లేస్, వాహన ట్రాకింగ్ కోసం టెలిమాటిక్స్, ఫాస్టాగ్‌లు, వాహన ఫైనాన్సింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఈ కంపెనీని రాజేష్ యాబాజీ, చాణక్య హృదయ, రామసుబ్రమణ్యం సహ-స్థాపించారు. ఇది భారతీయ లాజిస్టిక్స్ రంగంలో ఒక ప్రముఖ సాంకేతిక సంస్థ.
బ్లాక్ బక్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బ్లాక్ బక్ సంస్థ తమ ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు మారిస్తే.. అదే బాటలో మరిన్ని సంస్థలు కూడా బెంగళూరు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా.. ప్రస్తుతం టెకీ సంస్థలు.. బెంగళూరు వద్దు.. వైజాగ్ ముద్దు అని భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది.