తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్న రష్మిక మందనకు.. బాలీవుడ్ లో సికిందర్ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రష్మిక స్పీడ్ కు బ్రేకులు వేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన.. పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 2023 చివర్లో వచ్చిన రణబీర్ కపూర్.. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది.
Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!
ఆ తర్వాత 2024 డిసెంబర్ లో వచ్చిన పుష్ప సినిమా ఆమె కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఛావా సినిమా జాతీయస్థాయిలో రష్మిక మందనకు పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాతో ఆమె మరో హిట్టు కొడుతుందని అభిమానులు ఆశించారు. రంజాన్ సందర్భంగా ఆదివారం విడుదలైన సల్మాన్ ఖాన్.. సికిందర్ సినిమా ఆమెకు షాక్ ఇచ్చింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ అభిమానులను కూడా మెప్పించలేదు.
Also Read : ఎన్టీఆర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గతంలో సల్మాన్ ఖాన్ సినిమాలకు భారీ వసూళ్లు వచ్చేవి. ఓపెనింగ్స్ అదిరిపోయేవి.. కానీ ఈ సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. దీనితో రష్మిక మందన అభిమానులు కూడా నిరాశపడ్డారు. ఈ సినిమా కోసం ఆమె ఎక్కువ టైం కేటాయించింది. వేరే సినిమాలు ఉన్నా సరే ఈ సినిమా షూటింగ్ కోసం డేట్స్ ఎక్కువగా ఇచ్చింది. సల్మాన్ ఖాన్ సినిమా కావడంతో పక్కాగా తనకు మంచి ఇమేజ్ వస్తుందని ఆశించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోవచ్చని హోప్స్ పెట్టుకుంది. తీరా చూస్తే సినిమా రిజల్ట్ తేడాగా ఉంది.