ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో రోజుకో సంచలనం నమోదు అవుతోంది. ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత.. ఎవరిని అరెస్ట్ చేయవచ్చు అనే దానిపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లో డెన్ లు ఏర్పాటు చేసి, లిక్కర్ సొమ్ము దాచారు అనే సమాచారంతో సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తం 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు తరలించిన నగదు ఎంత అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
Also Read : జగన్‌కు వాళ్లు మాత్రమే సన్నిహితులా..?
ఈ కేసులో మరికొందరు విదేశాల్లో ఉన్నట్టు భావిస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని వారిని భారత్ రప్పించే ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు నగదు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. ఇదిలా ఉంచితే.. ఈ కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న విజయవాడ సీపీ రాజశేఖర్.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు కేసు దర్యాప్తు పురోగతిని ఆయనకు వివరించారు. అలాగే మరికొన్ని కీలక అంశాల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
Also Read : ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం క్లారిటీ..!
ఈ కేసులో బిగ్ బాస్ గా భావిస్తున్న వ్యక్తిని విచారణకు పిలిచే అంశంపై చర్చించినట్టు సమాచారం. బిగ్ బాస్ కు నోటీసులు ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి వంటి అంశాల గురించి చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కీలక వ్యక్తికి కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీ అయినట్టు టాక్. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బిగ్ బాస్ కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.